Hardik on Ishan Kishan: IPL 2025 మెగా వేలంలో చాలామంది ఆటగాళ్లు జట్లు మారాయి. ఏడు సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ కిషన్ వచ్చే సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడనున్నాడు. తోలుత ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ ను రిటైన్ చేయలేదు. ముంబైని ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, బుమ్ర మొత్తం ఐదు మందిని ముంబై ఇండియన్స్ ( Mumbai indians) రిటైన్ చేసుకుంది.
అయితే ముంబై ఇండియన్స్ ని ఎన్నోసార్లు ఆదుకున్న ఇషాన్ కిషన్ ను దక్కించుకుంటుందని అందరూ భావించారు కానీ వేలంలో ఇషాన్ కిషన్ ను కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్ ఆసక్తిని చూపించలేదు. ఇషాన్ కిషన్ రెండు కోట్ల రూపాయల బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. మొదట్లో ముంబై ఇండియన్స్ అతని కోసం వేలం వేసినప్పటికీ 3.20 కోట్లకు మించి వెళ్లలేదు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH ) జట్టు ఇషాన్ కిషన్ కోసం 11 కోట్లను వెచ్చించి అతడిని వేలంలో దక్కించుకుంది.
దీంతో రాబోయే సీజన్లో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో ఇషాన్ కిషన్ లేని లోటు స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది. తాజాగా ఈ విషయం పైన హార్దిక్ పాండ్యా స్పందిస్తూ…. డ్రెస్సింగ్ రూమ్ లో ఇషాన్ కిషన్ ను మిస్ అవుతాం అంటూ ఎమోషనల్ కామెంట్ చేశాడు. నిజానికి మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ టీం డ్రెస్సింగ్ రూమ్ లో ఇషాన్ కిషన్ చాలా సరదాగా కనిపిస్తాడు. గెలుపు ఓటములను పక్కన పెడితే అందరితోనూ సరదాగా ఉంటాడు. అయితే ఇషాన్ కిషన్ జట్టును వీడతాడని ముందే తెలుసని చెప్పాడు హార్థిక్ పాండ్యా. తోలుతా రిటైన్ చేయనప్పుడు వేలంలో కూడా అతడిని కొనుగోలు చేసే అవకాశాలు ఉండవని ముందే తెలుసని అన్నారు.
Also Read: MS Dhoni Sakshi Dance: భార్య సాక్షితో కలిసి ధోనీ డాన్స్…వీడియో వైరల్
ఇషాన్ కిషన్ ను మేము ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటామని, హార్దిక్ పేర్కొన్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్ షేర్ చేసిన వీడియోలో హార్దిక్ ఈ కామెంట్ చేశాడు. 2018 ఐపీఎల్ వేలంలో ఇషాన్ ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఆ సీజన్లో 14 మ్యాచులలో 149.45 స్ట్రైక్ రేటుతో 275 పరుగులు చేశాడు. ఆ తర్వాత సీజన్లో 7 మ్యాచులలో 101 పరుగులు మాత్రమే చేశాడు. 2020లో ముంబై ఇండియన్స్ తరపున ఇషాన్ అత్యధిక పరుగులు చేశాడు. 14 మ్యాచులలో 516 పరుగులు సాధించాడు. మళ్లీ 2021 సీజన్లో కాస్త నిరాశపరిచాడు.
ఆ సంవత్సరంలో పది మ్యాచులలో 241 అర్హులను మాత్రమే చేశాడు. ఇక 2022లో మళ్లీ చెలరేగి ఆడాడు. 14 మ్యాచులలో 418 పరుగులు చేశాడు. 2023 సీజన్లో 17 మ్యాచులలో 454 పరుగులు చేశాడు. అయితే గత సీజన్ లోను భారీ ధరకు కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ ను ఈ సంవత్సరం పక్కన పెట్టడంతో ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. మరి ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టు తరఫున ఏ విధంగా రాణిస్తాడో చూడాలి.