Kokapet: కోకాపేటలో దారుణం చోటుచేసుకుంది. అస్సాం రాష్ట్రానికి చెందిన జ్యోతి కృష్ణ ఉపాధి కోసం హైదరాబాద్‌కి వచ్చాడు. కృష్ణ జొమాటోలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కృష్ణ మద్యం మత్తులో భార్య జ్యోతితో గొడవ పడ్డాడు. వారిద్దరి మధ్య ఘర్షణ పెద్దది కావడంతో జ్యోతి ఆగ్రహంతో కృష్ణపై కత్తితో దాడి చేసింది. అతడి అరుపులు విని స్థానికులు ఘటన స్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ ఊపిరి వదిలాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.