Hardik Ex wife Natasha : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నటాషా స్టాంకోవిచ్ ని వివాహం చేసుకొని విడాకులు తీసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే పాండ్యాతో విడాకుల తరువాత కొద్ది రోజులకే తన స్వదేశానికి బయలుదేరింది నటాషా స్టాంకోవిచ్. విడాకుల తరువాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులు గా తమ ఇద్దరి బంధం కొనసాగుతుందని.. ఆగస్త్య కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటానని విడాకుల సమయంలో పాండ్యా స్పష్టం చేసారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా నటాషా స్టాంకోవిచ్(Natash stancovic) గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఓ జిమ్ లో నటాషా కసరత్తులు బాగానో చేస్తుంది. కసరత్తుల వరకు అయితే పర్వాలేదు. జిమ్ లో డంబెల్ పై ఒంటి కాలు పై కూర్చొని కాఫీ తాగింది. ఇలా ఒంటి కాలుపై ఉండటం చాలా అరుదు. అలాంటిది ఏకంగా డంబెల్ పై ఒంటి కాలుపై కూర్చొని కాఫీ తాగిందంటే..? మామూలు విషయం కాదు అని సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం.
Also Read : Sabalenka : యుఎస్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా అరీనా సబలెంక..ప్రైజ్ మనీ ఎంతంటే
మరోవిశేషం ఏంటంటే..? నటాషా ( Natasha) అక్కడ కూర్చున్నట్టుగానే ఆ జిమ్ లో ఉన్న వాల్ పై ఓ ఆర్టిస్ట్ బొమ్మ గీయడం విశేషం. నటాషా అలా ఒంటి కాలుపై కూర్చోవడం ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. మరోవైపు విడాకులు తీసుకున్న తరువాత నటాషా స్టాంకోవిచ్ అనే వ్యక్తితో కలిసి తిరుగుతోంది. బ్రదర్ అంటూనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. అది చాలదన్నట్టూ ఇద్దరూ కలిసి పలు పార్టీలకు, పబ్బులకు కూడా వెళ్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా అభిమమానులు ఆ ఫొటోలకు కామెంట్స్ చేస్తే.. మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. జస్ట్ ఫ్రెండ్స్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది నటాషా. అలాగే హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇక హార్దిక్ పాండ్యా (Hardik Pandya) విషయానికి వస్తే.. ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆసియా కప్ 2025 కోసం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 09న మంగళవారం నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. టీమిండియా సెప్టెంబర్ 10న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో 17 పరుగులు చేస్తే హార్దిక్ పాండ్యా చరిత్రలో నిలిచిపోనున్నాడు. ఆసియా కప్ టీ-20 ఫార్మాట్ లో హార్దిక్ ఇప్పటివరకు 80 పరుగులు చేసి.. 11 వికెట్లు తీసుకున్నాడు. మరో 17 పరుగులు చేస్తే.. ఈ ఫార్మాట్ లో 100 పరుగులు, 10+ వికెట్లు సాధించినటువంటి తొలి ఆటగాడిగా నిలవనున్నాడు హార్దిక్ పాండ్యా.