BigTV English

Hardik – Jasmin : కొత్త ప్రియురాలుతో హార్దిక్ పాండ్యా బ్రేకప్… నటాషా వార్నింగ్ ఇచ్చిందా !

Hardik – Jasmin : కొత్త ప్రియురాలుతో హార్దిక్ పాండ్యా బ్రేకప్… నటాషా వార్నింగ్ ఇచ్చిందా !

Hardik – Jasmin :  టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. విడాకుల తరువాత హార్దిక్, నటాషా పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా నటి జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నాడని రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వార్త వినిపిస్తోంది. హార్దిక్ పాండ్యాకి నటి జాస్మిన్ వాలియాల మధ్య బ్రేకప్ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇన్ స్టా గ్రామ్ లో ఒకరికొకరూ అన్ ఫాలో చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ లు, ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో జాస్మిన్.. పాండ్యాకి సపోర్టుగా స్టాండ్స్ లో కనిపించింది.


Also Read :  Samson brothers : సంజూ శాంసన్ కు బ్రదర్ కూడా ఉన్నాడా.. అతను కూడా స్టార్ క్రికెటర్ అని తెలుసా ?

పీఆర్ రిలేషన్ షిపా..?


దీంతో వారు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఒక రెడ్జిట్ యూజర్.. ఇటీవల వారు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకున్నారని చూశానని.. ఏంటి సంగతి.. పీఆర్ రిలేషన్ షిపా..? అని పోస్టు చేశాడు. దీనిపై కొందరూ అభిమానులు స్పందించారు. పాండ్యా వాలియా ఫొటోలకు ఇచ్చిన అన్ని లైకులను కూడా హార్దిక్ పాండ్యా తీసేశాడని మరికొందరూ తెలపడం విశేషం. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్న సమయంలో టీమిండియా ఆడే మ్యాచ్ లతో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్ ల సందర్భంగా స్టేడియంలో జాస్మిన్ కనిపించేది. హార్దిక్ కెప్టెన్ గా ఉన్న ముంబై టీమ్ బస్సులోనూ ఆమె ప్రయాణించినట్టుగా వార్తలు వినిపించాయి.

పాండ్యా రెస్ట్.. గ్రీన్ సిగ్నల్..!

ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తరుచూ గాయాల బారిన పడటంతో టెస్టులు ఆడనని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతానని ఇప్పటికే హార్దిక్ బీసీసీకి స్పష్టం చేశాడు.  ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో హార్దిక్ పాండ్యా ఆడటం లేదు. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ 2025లో టీమిండియా తరపున తిరిగి ఆడనున్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇది యూఏఈలో నిర్వహిస్తారు. ఇక బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడటంతో.. ఆసియా కప్ తరువాత  అక్టోబర్ లోనే భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది.  దీంతో ఆసియా కప్, ఆస్ట్రేలియా పర్యటన వరకు హార్దిక్ పాండ్యా కి విరామం దొరికినట్టు అయింది. హార్దిక్ పాండ్యా టీమిండియా లో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు. అటు బౌలింగ్ లో.. ఇటు బ్యాటింగ్ రెండింటిలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×