BigTV English

Hardik likely to lead India: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

Hardik likely to lead India: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

Hardik Pandya likely to lead India: ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ప్రస్తుతం టీమిండియా – జింబాబ్వేతో తలపడుతోంది. నేడు జరిగిన హరారే వేదికగా జరిగిన మూడో మ్యూచ్ లో భారత్ విజయం సాధించింది. అయితే, ఈ నెలఖారులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలు మాత్రం శ్రీలంకతో వన్డే సీరిస్ కు దూరంగా ఉండనున్నారు. కాగా, హార్దిక్ పాండ్య లంకతో పొట్టి సిరీస్ కు నాయకత్వం వహించే అవకాశమున్నట్లు సమాచారం.


ఐపీఎల్ తరువాత జరిగిన టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయిన కేఎల్ రాహుల్ శ్రీలంకతో వన్డే సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్ కు అతడు కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జులై 14న జింబాబ్వేతో భారత్ టీ20 సిరీస్ ముగియనున్నది. అనంతరం శ్రీలంకతో టీమిండియా జులై 27-30 మధ్య మూడు టీ20లు, ఆగస్టు 2-7 మధ్య మూడు వన్డేలు ఆడనున్నది.

Also Read: కష్టపడి గెలిచిన టీమిండియా!


కాగా, టీ20 వరల్డ్ కప్ ను భారత్ అందుకోవడంలో చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్య అత్యంత కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మెరుగైన ప్రదర్శనతో టీమిండియాను గెలుపు దిశగా నడిపించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 సిరీస్ లకు కెప్టెన్ స్థాం ఖాళీ అయ్యింది. దీంతో పాండ్యకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related News

Rinku Singh’s Wedding : రింకు సింగ్ పెళ్ళికి షారుక్ ఖాన్.. కోట్లల్లో గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ ?

Ravichandran Ashwin : అశ్విన్ రిటైర్మెంట్… CSKకు 10 కోట్ల లాభం… రంగంలోకి కాటేరమ్మ కొడుకు?

Romario Shepherd: ఒక్క బాల్‌కు 22 రన్స్.. RCB ప్లేయర్ అరాచకం

Mark Wood : రోహిత్ శర్మకు బౌలింగ్ వేయడం నా వల్ల కాదు.. ఇంగ్లాండ్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

Michael Clarke Cancer : ఇప్పటివరకు క్యాన్సర్ బారిన పడ్డ క్రికెటర్లు వీళ్లే.. లిస్టులో టీమ్ ఇండియా ప్లేయర్ కూడా

Virender Sehwag :ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో వేలు పెట్టిన సెహ్వాగ్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్

Big Stories

×