Big Stories

AyeJude: బ్రేకింగ్.. ప్రణీత్ హన్మంతు అరెస్ట్.. వీడియో రిలీజ్ చేసిన అన్న ఏజూడ్

AyeJude: ఏజూడ్.. యూట్యూబ్ చూసేవారికి చాలా తెల్సిన పేరు. ఎలాంటి ఫంక్షన్ కు ఎలాంటి అవుట్ ఫిట్ వేసుకోవాలో చెప్తూ కొద్దికొద్దిగా ఎదుగుతూ యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. అతని పూర్తి పేరు అజయ్ హన్మంతు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రణీత్ హన్మంతుకు సొంత అన్ననే అజయ్. యూట్యూబ్ లో చైల్డ్ అబ్యూజ్ చేసినందుకు ప్రణీత్ ను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నెటిజన్స్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ప్రణీత్ పై ఫైర్ అవుతూనే ఉంది.

- Advertisement -

ఇక నెటిజన్స్ ప్రణీత్ వివాదంలోకి అతని అన్న అజయ్ ను కూడా లాకొస్తున్నారు. అతడు కూడా ఫ్రాడ్ అని, యూట్యూబ్ లో డబ్బులు ఇచ్చినట్లు ఇచ్చి మోసం చేస్తాడని.. ఇద్దరు అన్నదమ్ములు ఫ్రాడ్స్ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజయ్.. ఈ వివాదంపై నోరువిప్పాడు. అసలు ఈ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ప్రజలకు ఎంతవరకు తెలుసో.. ఈ వివాదం గురించి తనకు అంతే తెలుసనీ తెలిపాడు. అంతేకాకుండా తనకు 6 ఏళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

- Advertisement -

” నా పెళ్లి విషయం ఎంతో ఆనందంగా.. మంచి అకేషన్ చూసి అభిమానులకు చెప్పాలనుకున్నాను. కానీ, ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. కాలేజ్ లో ప్రేమించిన అమ్మాయినే నేను 6 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాను. సంపాదన లేకుండా ఇంట్లో ఆమెతో పాటు నేను ఉండలేక బయటకు వచ్చాను. నా భార్య సపోర్ట్ తో నేను ఎదిగాను. ఎన్నో కష్టాలను చూసాను. అందరిలా చేస్తే నాకు గుర్తింపు ఉండదని కష్టపడి ఏజూడ్ ను ప్రారంభించాను. ఎదిగాను.. నాకు తగ్గ సాయం అందరికి చేస్తున్నాను.

6 ఏళ్లుగా నా కుటుంబానికి నేను దూరంగా ఉంటున్నాను. సోషల్ మీడియా లో వున్నా ఇన్సిడెంట్ కి మీరు ఎంత దూరం ఉన్నారో, నేను అంతే దూరం గా ఉన్నాను. కొంతమంది నా పేరును వాడుతున్నారు. నేను వారిని ఏమి అనడం లేదు. ఇక ఈ అడల్ట్ హైమర్ ను నేను ఎంకరేజ్ చేయను. నా పని నేను చేసుకుంటూ బయట ఉన్నాను.. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పుకార్లు 100 ఉంటాయి. నిజం ఒక్కటే ఉంటది. తప్పు ఎవరు చేసిన తప్పే.. తమ్ముడైనా” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News