Big Stories

Hardik Pandya: అతని వల్లే ఓడిపోయాం.. హార్థిక్ పాండ్యా సంచలన కామెంట్స్..

Hardik Pandya Sensational Comments On Tilak Varma: తరుచుగా వార్తల్లో నిలుస్తున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. వరుస ఓటములతో డీలా పడ్డ ముంబై ఇండియన్స్ జట్టుకు హార్థిక్ కెప్టెన్ తలనొప్పిగా మారిందని ఇప్పటికే పలువురు మాజీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా మరోసారి పాండ్యా సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.

- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముగిసిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో ఓటమి చవిచూశాక పాండ్యా తమ జట్టు ఓటమికి కారణం తెలుగు కుర్రాడేనని చెప్పకనే చెప్పేశాడు. ఇంతకీ ఎవరని అనుకుంటున్నారా. అదే ముంబై జట్టుకు వెన్నుముకలా నిలిచిన తిలక్ వర్మ. తిలక్ వర్మలో మ్యాచ్‌ను గెలిపించాలనే తపన లేకనే ఓడిపోయాం అని మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నాడు. దీంతో తెలుగు అభిమానులు, ముంబై అభిమానులు, మాజీ క్రికెటర్లు అవాక్కయ్యారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 32 బంతుల్లో 63 పరుగులు చేసి ముంబై పోరాటంలో కీలకంగా మారాడు. చివరి ఓవర్ తొలి బంతికి రనౌట్ అయిన తిలక్ వర్మ క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ముంబై గెలిచేదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయినా పాండ్యా అలా అనడం ఏంటని క్రీడా లోకమే విస్తుపోయింది.

- Advertisement -

258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడినప్పటికీ వరుస వికెట్లు కోల్పోతూ చేధనలో తడబడింది. అయితే ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 8వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌కు వచ్చాడు. అప్పుడు క్రీజులో హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ ఉన్నారు. కాగా మొదటి 5 బంతులకు 4 సింగిల్స్ తీయడంతో మ్యాచ్‌లో వెనుకబడ్డామని అన్నాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్లు అక్షర్ పటేల్‌ను ఎటాక్ చేయలేదని డిఫెన్స్ ఆడారని అన్నాడు. దీంతో నెటిజన్లు హార్థిక్ పాండ్యాపై ఫైర్ అవుతున్నారు. బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చిన పాండ్యానే ముంబై ఓటమికి ప్రధాన కారణమని సోషల్ మీడియాలో పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు.

Also Read: ముంబై మళ్లీ ఓటమి.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

కాగా ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో 9 మ్యాచులు ఆడి 3 విజయాలు 6 పరాజయాలతో 9వ స్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేసి పాండ్యాకు ఇచ్చిన ముంబై జట్టు పెద్ద మూల్యమే చెల్లించుకుంటుందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News