Hardik Pandya: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… రెండు రోజుల కిందట హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో…. ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలోనే ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్.. జరిగిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్ రోజున నల్ల బ్యాడ్జీలు, రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని రెండు జట్ల ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది.
దేశాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు…. నల్ల బ్యాచీలు ధరించిన ముంబై ఇండియన్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు…. మ్యాచ్ ప్రారంభం కంటే ముందు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఇరు జట్ల లోని విదేశీ ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా దేశాన్ని అవమానించేలా హార్దిక్ పాండ్యా వ్యవహరించారు. క్రీడాకారులతో పాటు క్రికెట్ అభిమానులంతా నిలబడి… సైలెన్స్ మైంటైన్ చేస్తున్న నేపథ్యంలో హార్థిక్ పాండ్య మాత్రం రెచ్చిపోయాడు. అక్కడే నిలబడి పగలబడి నవ్వాడు. వాళ్లంతా సైలెంట్ గా సంతాపం తెలుపుతుంటే పక్కనే ఉన్న ప్లేయర్ తో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించాడు హార్థిక్ పాండ్యా.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హార్దిక్ పాండ్యా పై సీరియస్ అవుతున్నారు క్రీడ అభిమానులు, ఇండియన్స్. వీడికి ఇక్కడ పని లేదు… ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు.. ఉన్న భార్యను వదిలేశాడు… పిచ్చోడిలా తిరుగుతున్నాడని ఫైర్ అవుతున్నారు. దేశం భద్రత విషయంలో సంతాపం తెలుపుతున్న నేపథ్యంలో.. పిచ్చోడిలా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">