BigTV English

Haris Rauf On Indian Team: దుబాయ్‌ లో చిత్తుగా ఓడిస్తాం.. టీమిండియాకు పాక్‌ బౌలర్‌ హెచ్చరికలు !

Haris Rauf On Indian Team: దుబాయ్‌ లో చిత్తుగా ఓడిస్తాం.. టీమిండియాకు పాక్‌ బౌలర్‌ హెచ్చరికలు !

Haris Rauf On Indian Team: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రేపు భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దుబాయిలో జరగబోతున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు పూర్తి విశ్వాసంతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమిని మూటగట్టుకుంది.


 

ఇక సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్ పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. భారత్ తో మ్యాచ్ కోసం మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ఫిబ్రవరి 20న కరాచీ నుండి దుబాయ్ కి చేరుకుంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్ ని కూడా మొదలుపెట్టింది.


మరోవైపు భారత్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి మూడు వారాల ముందే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో జరిగే మ్యాచ్ గురించి తాము ఎక్కువగా ఆలోచించడం లేదని తెలిపాడు. దుబాయ్ లో పాకిస్తాన్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా హరీస్ రౌఫ్ మాట్లాడుతూ.. ” టి-20 ప్రపంచ కప్ 2021, ఆసియా కప్ 2022లో భారత్ పై గెలిచిన విజయాలనుంచి స్ఫూర్తి పొందుతాం.

భారత్ తో మ్యాచ్ సందర్భంగా మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మా ఆటగాళ్లు అందరూ రిలాక్స్ గా ఉన్నారు. ఇది ఓ సాధారణ మ్యాచ్ మాత్రమే. భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అన్ని క్రికెట్ మ్యాచ్ ల లాగే జరుగుతుంది. అయితే దుబాయిలోని పరిస్థితులపైనే మా ఆట ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాకు నమ్మకాన్ని ఇస్తుంది. గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ మేము భారత్ ని ఓడించాం. ఆ మ్యాచ్లలో చేసిన మంచి పనులని మళ్లీ చేసి భారత్ ని ఓడించడానికి ప్రయత్నిస్తాం.

 

ఇది మంచి మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. మా రికార్డులు కూడా బాగానే ఉన్నాయి. అయితే దుబాయ్ పిచ్ లాలో స్పిన్ ట్రాక్ కూడా ఉండొచ్చు. పరిస్థితులను బట్టి వాటిని బాగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం” అని రౌఫ్ తెలిపాడు. అయితే ఓవరాల్ గా ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ పై భారత్ కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఇరుజట్లు 21సార్లు తలపడ్డాయి. వీటిలో 16 మ్యాచ్లలో భారత్ విజయం సాధించగా. పాకిస్తాన్ కేవలం ఐదు మ్యాచ్లలో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీ లో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో హరీష్ రావు ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.

 

 

View this post on Instagram

 

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×