E-Paper
Advertisement

పాకిస్తాన్ మీడియాను బాయ్ కాట్ చేసిన‌ బాబ‌ర్ ఆజం.. దేశ‌ద్రోహి అంటూ రివ‌ర్స్ ఎటాక్

పాకిస్తాన్ మీడియాను బాయ్ కాట్ చేసిన‌ బాబ‌ర్ ఆజం.. దేశ‌ద్రోహి అంటూ రివ‌ర్స్ ఎటాక్
Advertisement

Babar Azam Snubs Pakistani Journalists:  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ టి20 టోర్నమెంట్ (International League T20 tournament) ఆడుతున్నాడు. ఇందులో భాగంగా యూఏఈలో ఉన్న బాబర్ ఆజం (Babar Azam) పాకిస్తాన్ జర్నలిస్టులను అవమానించాడు. ఏ ఒక్క పాకిస్తాన్ జర్నలిస్టు తన ఇంటర్వ్యూ కోసం రావద్దంటూ ఆదేశించాడు. అదే సమయంలో నలుగురు భారత జర్నలిస్టులకు మాత్రం ఇంటర్వ్యూలు ఇచ్చి… వివాదానికి తెర‌లేపాడు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై ఆ దేశ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబర్ ఆజంను దేశద్రోహి అంటూ నిరసన తెలుపుతున్నారు. పాకిస్తాన్ జర్నలిస్టులకు కాకుండా భారతీయులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటని ఫైర్ అవుతున్నారు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం విచారణ చేసి.. బాబర్ ఆజంపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పాకిస్తాన్ మీడియాను బాబ‌ర్ ఆజం బాయ్ కాట్ ఎందుకు చేశాడు?

మాజీ కెప్టెన్ బాబర్ ఆజం…పాకిస్తాన్ దేశ మీడియాను బాయ్ కాట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దుబాయ్ లో ఇంటర్నేషనల్ లీగ్ టి20 ఆడుతున్న బాబర్ ఆజం… మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జర్నలిస్టులు అతని వద్దకు వెళ్లి ఇంటర్వ్యూలు అడిగారు. కానీ బాబర్ ఆజం మాత్రం వాళ్లను వెనక్కి పంపించాడు. భారతీయ జర్నలిస్టులకు మాత్రం ఇంటర్వ్యూలు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడని తెలుస్తోంది.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

గత మూడు సంవత్సరాలుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న బాబర్ ఆజంను ఉద్దేశించి పాకిస్తాన్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని అంటున్నారు. అసలు బాబర్ ఆజం క్రికెట్ కు పనికిరాదని చాలా స్టోరీలు పాకిస్తాన్ టీవీ ఛానల్స్ లలో వచ్చాయని స‌మాచారం. అత‌ని వ్య‌క్తి గ‌త జీవితాన్ని కూడా టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. పెళ్లి కావడం లేదని బాధలో సరిగ్గా క్రికెట్ ఆడడం లేదని బాబర్ ఆజంపై మరికొంతమంది ప్రచారం చేశారని అంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న బాబర్ ఆజం…. దుబాయ్ లో పాకిస్తాన్ మీడియాను దూరంగా పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

బాబర్ ఆజం నిర్ణ‌యంపై త‌న్వీర్ అహ్మ‌ద్ రియాక్ట్

Advertisement

బాబర్ ఆజం తీసుకున్న ఈ నిర్ణయంపై త‌న్వీర్ అహ్మ‌ద్ కూడా రియాక్ట్ అయ్యాడు. కష్టకాలంలో బాబర్ ఆజంను పాకిస్తాన్ మీడియా దారుణంగా ఆడుకుందని.. అతని జీవితాన్ని బజారుకు ఈడ్చిందని ఫైర్ అయ్యాడు. అలాంటి పాకిస్తాన్ మీడియాను దూరం పెట్టడం కరెక్టేనని పోస్ట్ పెట్టాడు.

 

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

Related News

వైభ‌వ్ నాకు కొడుకు లాంటోడు…200 బాదాక‌ యువ‌రాజ్ పేరు చెప్పి కొంప‌ముంచాడు

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. వ‌న్డేల్లో 300 క‌చ్చితంగా కొడ‌తాడు

అంబానీ బిజినెస్ మైండ్..జైస్వాల్, ఆర్చ‌ర్ కోసం హార్దిక్ పాండ్యా ఎర‌గా వాడేశారుగా!

వైభ‌వ్ వ‌య‌స్సుపై త‌ప్పుడు కూత‌లు కూస్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. క‌మ్రాన్ అక్మ‌ల్ వార్నింగ్

అల్లా మీద ఒట్టు.. సెమీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

రాసి పెట్టుకోండి.. డేవిడ్ వార్న‌ర్, బెన్ స్టోక్స్ అన్ సోల్డ్ గా మిగులుతారు

సన్‌గ్రూప్ ఉద్యోగుల కోసం కావ్య పాప దంపతుల షాకింగ్ నిర్ణయం..హనీమూన్ క్యాన్సిల్ చేసుకుని మరీ!

Big Stories

Advertisement
×