BigTV English

Graeme Swann : ‘పొరపాటున కూడా కోహ్లిని రెచ్చగొట్టద్దు.. జట్టును హెచ్చరించిన స్వాన్‌ ‘

Graeme Swann : ‘పొరపాటున కూడా కోహ్లిని రెచ్చగొట్టద్దు.. జట్టును హెచ్చరించిన స్వాన్‌ ‘

Graeme Swann : భారత్ లో సుదీర్ఘ పర్యటనకు ఇంగ్లాండ్ బయలుదేరుతోంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలిటెస్ట్ జనవరి 25న హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టీమ్ పొరపాటున స్లెడ్జింగ్ కి పాల్పడితే ప్రమాదమని మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ హెచ్చరించాడు. చేస్తే చేశారు గానీ ముఖ్యంగా విరాట్ కొహ్లీ జోలికి మాత్రం వెళ్లవద్దని తెలిపాడు.


అంతేకాదు కొన్ని జాగ్రత్తలు కూడా తెలిపాడు. అక్కడ పులి ఉంటుంది కొడకా, అది కింగ్… దాని జోలికెళితే మామూలుగా ఉండదని… ఆ బ్యాట్ ని మడతపెట్టి… ఒకొక్క బాల్ ని ఉతికి ఆరబెడతాడు. తననేమైనా అంటే మాత్రం రెచ్చిపోతాడు. దాన్ని మీరు తట్టుకోలేరని హెచ్చరించాడు. అంతేకాదు తన అనుభవంలో జరిగిన ఒక ఉదాహరణ కూడా చెప్పాడు.

2012 సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తేడాతో గెలిచింది. అయినా సరే, విరాట్ దెబ్బని మరిచిపోలేమని అన్నాడు. అందరికీ చాకిరేవు పెట్టాడని అన్నాడు. ఇప్పటికి నాకు గుర్తుండిపోయిందీ అంటే, అదెంత విధ్వంసమో మీరు గుర్తించాలని అన్నాడు. నిజానికి ఇంగ్లాండ్ బౌలర్లకి ఆ టూర్ ని ఒక పీడకలగా మిగిల్చాడని అన్నాడు.


ఇంతకీ విరాట్ ని ఎవరేమన్నారని అంటే, అది కూడా చెప్పాడు. మా బౌలర్ స్టీఫన్ ఫిన్ బౌలింగ్ లో కొహ్లీ ఫోర్లు కొట్టాడు. దాంతో తను అసహనంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కొహ్లీని చూసి ఏదో అన్నాడు. దాంతో కొహ్లీ ఇంక రెచ్చిపోయాడు. పులిలా విరుచుకుపడ్డాడు.

అదెంత పెద్ద పొరపాటో తర్వాత ఫిన్ కి అర్థమైంది. తర్వాత మ్యాచ్ ల్లో కూడా ఫిన్ ని టార్గెట్ చేసుకుని విరాట్ ఉతుకుడు మొదలెట్టాడు. ఆ సిరీస్ లో ఫిన్ చాలా పరుగులు సమర్పించుకున్నాడు. వాటిలో ఎక్కువ విరాట్ కొట్టినవేనని అన్నాడు. అప్పటి నుంచి ఎవరినేమన్నా, విరాట్ జోలికి మాత్రం వెళ్లేవాళ్లం కాదని ఆ నాటి చేదు జ్ణాపకాన్ని తమ వాళ్లకి ఒక సీనియర్ గా గుర్తు చేశాడు.

ఇదండీ సంగతి…మరి మనవాళ్లంటే ఆ మాత్రం భయం ఉండాలి అంతేకదా…అదీ మన కింగ్ అంటే…కొహ్లీతో మజాక్ లా…ఏ బౌలర్ నైనా లాగిపెట్టి బ్యాట్ తో కొట్టడమేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×