BigTV English
Advertisement

Nagarkurnool : విషాదం నింపిన కొత్త బట్టలు.. పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్య

Nagarkurnool : విషాదం నింపిన కొత్త బట్టలు.. పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్య
This image has an empty alt attribute; its file name is 5a4625709a0eb3aa9b9876f7ddcb8d38.jpg

Nagarkurnool : సంక్రాంతి పండుగ వేళ కొత్త బట్టలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. భార్య.. భర్తను పండగకు కొత్త బట్టలు కొనివ్వాలని కోరింది. జీతం డబ్బులు రాలేదని.. అయినా కొనిస్తానని భర్త చెప్పగా ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య మనస్థాపానికి గురై తన ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల లోతట్టు ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పెంటలో చోటుచేసుకుంది.


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ పెంటలో నివసించే చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు. వారికి 8 మంది సంతానం. చిన్న నాగమ్మ కొత్తబట్టల కోసం భర్తతో గొడవ పెట్టుకుంది. భర్త ఇంటి నుండి వెళ్లి వచ్చే సరికి చిన్న నాగమ్మ తనకున్న నలుగురి పిల్లల్లో యాదమ్మ (1), బయమ్మ (3) ఇద్దరి ఆడపిల్లలను గొంతు నులిమి చంపేసింది. ఆపై తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

బయన్న.. కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచ్ మ్యన్‌గా పనిచేస్తున్నాడు. నాలుగైదు నెలలుగా జీతం రావడం లేదు. ఇటీవల తాను ఫైర్ లైన్ కూలీ పని చేసిన డబ్బులు చేతికి రావడంతో.. కొత్త బట్టల కోసం మన్ననూర్ గ్రామానికి వెళ్ళాడు. అంతలోనే భార్య ఈ దారుణానికి ఒడిగట్టిందని కుటుంబ సభ్యులు, గూడెం వాసులు వాపోయారు. ముక్కుపచ్చలారని పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Related News

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Pune Crime: భార్యను చంపి ఇనుప డబ్బాలో వేసి కాల్చి.. ఆమె ఫోన్ నుంచి ఐ లవ్ యూ మేసెజ్, ఆ తర్వాత నటన మొదలు

Bus Incident: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. తర్వాత ఏం జరిగిందంటే..

Roof Collapse: ఇంటి పైకప్పు కూలిపోయి.. ఐదుగురి మృతి

Bhimavaram Crime: మా అమ్మ, తమ్ముడిని చంపేశా.. పోలీసులకు ఫోన్ చేసి, భీమవరంలో ఘోరం

Fire Accident: వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ. 80 లక్షల ఆస్తి నష్టం

Tamilnadu Crime: ఫోటోలు చూసి షాకైన భర్త.. మరో మహిళతో భార్య రొమాన్స్, చిన్నారిని చంపేసి

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Big Stories

×