Tobacco Alcohol Ban: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎట్టకేలకు ముగిసింది. మూడు వారాలపాటు క్రీడాభిమానులను ఎంతగానో అలరించిన ఈ మెగా టోర్ని భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో కంప్లీట్ అయ్యింది. దీంతో ఇక క్రికెట్ లవర్స్ దృష్టి ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} వైపు మళ్ళింది. మరో 11 రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఈ 18వ సీజన్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Ravindra Jadeja: టీమిండియా విజయం వెనుక పుష్ప రాజ్ ?
గత 17 సీజన్లుగా క్రీడాభిమానులను అలరిస్తున్న ఈ ఐపీఎల్ 18వ సీజన్ ని గత సీజన్ల కంటే గ్రాండ్ గా నిర్వహించేందుకు ఐపీఎల్ బోర్డు ఇప్పటికే ప్లాన్స్ మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే అన్ని జట్లు ఈ సీజన్ కోసం ప్రిపరేషన్స్ కూడా మొదలుపెట్టాయి. ఈ సీజన్ మార్చ్ 22 నుండి మే 25 వరకు జరుగుతుంది. మొత్తం 13 వేదికలలో 74 మ్యాచ్ లు జరగబోతున్నాయి. పలు ఫ్రాంచైజీలు తమ అభిమానులను ఆకర్షించేందుకు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొత్త కొత్త అప్డేట్స్ ని ఇస్తున్నాయి.
మరోవైపు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ల టికెట్ల విక్రయాలు కూడా మొదలైపోయాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో క్యాష్ రిచ్ లీగ్ నిర్వాహకులకు పెద్ద షాక్ తగిలింది. ఐపీఎల్ లో పొగాకు, మద్యం అడ్వటైజ్మెంట్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా సరోగసికి సంబంధించిన యాడ్స్ ని కూడా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. యూత్ కి రోల్ మోడల్ గా ఉండే క్రికెట్ ప్లేయర్లకు ఇలాంటి యాడ్స్ తో సంబంధం ఉండకూడదని కేంద్రం పేర్కొంది.
ఈ మేరకు ఐపీఎల్ చైర్ పర్సన్ కి లేఖ రాసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. పొగాకు, మద్యం, సరోగసి యాడ్స్ ని టెలికాస్ట్ చేయవద్దని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్. ” భారత యువతకు ఆదర్శంగా ఉండే క్రికెట్ ఆటగాళ్లకు ఏ రకమైన పొగాకు లేదా మద్యం యాడ్స్ తో సంబంధం ఉండకూడదు. ఐపీఎల్ లో పాల్గొనే ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు కూడా అలాంటి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయకుండా అడ్డుకోవాలి.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌ను పరుగెత్తించిన జడేజా కూతురు !
దేశంలో అతిపెద్ద క్రీడా సంబరమైన ఐపీఎల్ మీద సామాజిక బాధ్యత ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తుల యాడ్స్ మీద బ్యాన్ విధించాలి. ఐపీఎల్ కి సంబంధించిన కార్యక్రమాలు జరిగే స్టేడియం, ప్రాంగణాలలో, జాతీయ మీడియాలో ప్రసారమయ్యే సెషన్ సమయంలో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వద్దు. అమ్మకాలపై కూడా నిషేధం ఉంది. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి” అని కేంద్రం ఆదేశించింది.
Directorate General of Health Services (DGHS) writes to IPL Chairperson regarding the regulation of Tobacco and Alcohol advertisements including surrogate advertisementing and sales during the IPL season starting from 22nd March. pic.twitter.com/0kNvKHzWet
— ANI (@ANI) March 10, 2025