Mad Square: ఈరోజుల్లో సినిమా విషయంలో కాన్పిడెంట్‌గా ఉన్నారంటే నిర్మాతల డిమాండ్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ విషయంలో నిర్మాతల చేతిలోనే హక్కులు ఉంటాయి కాబట్టి వారికి నచ్చితేనే సినిమాకు డీల్ కుదురుతుంది. ప్రస్తుతం ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందని సమాచారం. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా ఇంకా థియేట్రికల్ రైట్స్ రేటు తేలలేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా రెండు వారాలలో విడుదల తేదీ ఉన్నా నిర్మాతలు థియేట్రికల్ రైట్స్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
పాజిటివ్ బజ్
దాదాపు రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘మ్యాడ్’. అప్పట్లో ఈ సినిమాపై పెద్దగా హైప్ లేదు. హీరోల గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అయినా కూడా కేవలం కంటెంట్‌తో, అందులోని కామెడీతో సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మూవీ రిజల్ట్ చూసి ‘మ్యాడ్’కు కచ్చితంగా సీక్వెల్ తెరకెక్కించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఆ సీక్వెల్ విషయాన్ని కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. దీంతో సీక్వెల్ కూడా ఫస్ట్ పార్ట్‌లాగానే ఉంటుందని ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఇన్నాళ్ల తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదలకు సిద్ధమయ్యింది. దీని ప్రమోషన్స్ వల్ల సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ చివరి నిమిషంలో విడుదల విషయంలో కన్ఫ్యూజన్ మొదలయినట్టు తెలుస్తోంది.
డిమాండ్లు ఎక్కువ
మార్చి 28న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. కానీ ఇంకా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్‌కు రేటు ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. ‘మ్యాడ్’ హిట్ కావడంతో ఈ సీక్వెల్‌కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ బజ్‌నే క్యాష్ చేసుకుందామని అనుకుంటున్నారట మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్‌తో రూ.15 నుండి 20 కోట్లు వరకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇది నిజమే అని డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్తున్నారు. నిర్మాతల డిమాండ్ మరీ ఎక్కువగా ఉండడంతో థియేట్రికల్ రైట్స్ కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరీ ఈ చివరి నిమిషంలో నిర్మాతలు ఏం ప్లాన్ చేయబోతున్నారని ఇండస్ట్రీ నిపుణుల్లో సైతం ఆసక్తి మొదలయ్యింది.
Also Read: ఆయన రిజెక్ట్ చేసిన స్టోరీ అబ్బవరంకు ఎలా నచ్చిందో..
అందరి నమ్మకం
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమానే ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ ఇందులో హీరోలుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ విడుదలయ్యి యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ‘మ్యాడ్ స్క్వేర్’ థియేట్రికల్ రైట్స్ విషయంలో నిర్మాతలు కూడా వెనక్కి తగ్గడానికి ఇష్టపడడం లేదు. నిర్మాతలు మాత్రమే కాదు.. హీరోలు కూడా ఈ సినిమా రిజల్ట్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మొత్తానికి థియేట్రికల్ రైట్స్ విషయంలో రేటు తేలకపోతే మార్చి 28న ఈ మూవీ విడుదల అవ్వడం కష్టమే అనిపిస్తోందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.