OTT Movie : కొంతమంది ఆటవికులు బయట ప్రపంచంలోని మనుషులు కన్పిస్తే చంపి తినేస్తారన్న విషయాన్ని చాలాసార్లు విన్నాం మనం. ఇక ఇదే నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరపైకి వచ్చాయి కూడా. కానీ మనుషుల మాంసాన్ని నరమాంస భక్షకులు కాకుండా, ఆధునిక సమాజంలో నివసించే వాళ్ళు తింటే… ఈ విషయం వినడానికి విడ్డూరంగా ఉన్నా, చూడడానికి మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇదే లైన్ తో తెరకెక్కిన సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్.
తెలుగులో కూడా అందుబాటులో…
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘వాట్ యూ విష్ ఫర్’ ( What You Wish For). 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఒక అమెరికన్ థ్రిల్లర్. నికోలస్ టామ్ దర్శకత్వం వహించారు. ఇందులో నిక్ స్టాల్, టామ్సిన్ టోపోల్స్కీ, రాండీ రామోస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023లో మేలో Fantaspoa ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. థియేటర్లలో లిమిటెడ్ రిలీజ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple tv)లో రెంట్ లేదా కొనుగోలు ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
‘వాట్ యూ విష్ ఫర్’ మూవీ ర్యాన్ (నిక్ స్టాల్) అనే చెఫ్ చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత థ్రిల్లర్. ర్యాన్ ఒక మంచి చెఫ్. కానీ అతను జూదం, అప్పులు, చట్టపరమైన సమస్యలతో సతమతం అవుతాడు. అతను అమెరికాలో తన గతాన్ని వదిలి, లాటిన్ అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో తన పాత స్నేహితుడు జాక్ (రాండీ రామోస్) వద్దకు పారిపోతాడు. జాక్ కూడా ఒక చెఫ్, అతను ధనవంతులైన క్లయింట్‌ల కోసం రహస్యంగా హై-ఎండ్ డిన్నర్‌లు తయారు చేస్తూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ర్యాన్, జాక్ లైఫ్ స్టైల్ ని చూసి ఆశ్చర్యపోతాడు. అతని సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు.
అయితే ర్యాన్ త్వరగానే జాక్ మాఫియాతో కలిసి పని చేస్తున్నాడు అని, అతని చెఫ్ టాలెంట్ ను ఉపయోగించి వాళ్ళు అక్రమ కార్యకలాపాలను నడుపుతున్నారని తెలుసుకుంటాడు. ర్యాన్ ఈ సీక్రెట్ తెలుసుకోగానే, జాక్ ఒక ఊహించని ఘటనలో చనిపోతాడు. దీంతో జాక్ ప్లేస్ లోకి ర్యాన్ వెళతాడు. జాక్‌గా నటిస్తూ, తన క్లయింట్‌ల కోసం మంచి విందులను తయారు చేస్తాడు. కానీ ఆ తరువాత మొదలవుతుంది అసలు కథ.
Read Also : కజిన్ తో ఎఫైర్… నచ్చినోడు దక్కలేదని ఎంతకు తెగించింది మావా ? బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ మూవీ
ర్యాన్‌కు ఇమోజీన్ (టామ్సిన్ టోపోల్స్కీ) అనే మరో లేడీ చెఫ్‌తో స్నేహం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇమోజీన్ ర్యాన్‌కు ఈ గ్రూప్ రూల్స్ ను వివరిస్తుంది. వారిద్దరూ కలిసి ఒక ముఖ్యమైన డిన్నర్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది ధనవంతుడైన క్లయింట్ మౌరిస్ (జువాన్ ఫ్రాన్సిస్కో) కోసం. ర్యాన్ ఈ డిన్నర్‌లో వండే “వంటకాల” వెనుక ఉన్న సీక్రెట్ ను తెలుసుకుని దిగ్భ్రాంతికి గురవుతాడు. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతుంది పరిస్థితి. అక్కడి నుంచి పారిపోలేడు. ఒకవేళ అదే జరిగితే డైరెక్ట్ గా జైలుకే. మరి ఇలాంటి పరిస్థితిలో ర్యాన్ ఏం చేశాడు? అసలు ఈ రిచ్ పర్సన్స్ చేస్తున్న సీక్రెట్ వ్యాపారం ఏంటి? ర్యాన్ భయపడేంతగా అక్కడ ఏం జరుగుతోంది? మనిషి మాంసంతో వీళ్ళకు ఉన్న లింకు ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.