Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట గురించి అంతా చర్చించుకోవడం విశేషం. ఎందుకు అంటే ఈ ఐపీఎల్ సీజన్ లో అతను ఎంట్రీ చేశాడు. ఎంట్రి ఇచ్చిన తొలి బంతికే సిక్స్ కొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రతీ ఇన్నింగ్స్ లో సిక్సులు బాదడం ఒక ఎత్తు అయితే.. నిన్న గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు నెలకొల్పడం మరో ఎత్తు. అతి చిన్న వయస్సులోనే ఐపీఎల్ లో తక్కువ బాల్స్ లో సెంచరీ చేసిన ఆటగాడిగా తన పేరిట లిఖించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ.
Also Read : VVS on Vaibhav Suryavanshi: వైభవ్ కన్నీళ్లు చూసి.. లక్ష్మణ్ చేసిన పని ఇది, అతడి కెరీర్‌నే మార్చేసిందిగా!
తాజాగా వైభవ్ సూర్యవంశీ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైభవ్ కు మటన్ అలాగే చికెన్ ముఖ్యంగా పిజ్జా అంటే బాగా ఇష్టమట. వాటిని ఇవ్వగానే క్షణాల్లో ఫినిష్ చేస్తాడట. ఈ విషయాన్ని వాళ్ల కోచ్ మనీష్ ఓజా వెల్లడించాడు. తాజాగా ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్ మనీష్ ఓజా ఇలా చెప్పాడు. “మటన్ నహీ ఖానా హై ఉస్కో, సూచనలు హైన్. పిజ్జా హతా దియా హై ఉస్కే డైట్ చార్ట్ మేం సే. వైభవ్ కి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పిజ్జా అంటే చాలా ఇష్టం. అందుకే కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు.” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చికెన్, మటన్, పిజ్జాలను కాస్త బంద్ చేశాడని వెల్లడించాడు.
అలాగే వైభవ్ బ్యాటింగ్ గురించి కూడా వివరించాడు. వైభవ్ అద్భుతమైన బ్యాటర్ అని.. బ్రియన్ లారా ను ఇష్టపడుతానని పదే పదే చెబుతుంటాడు. కానీ వైభవ్ యువరాజ్ సింగ్, బ్రియన్ లారా మిక్స్ అని చెప్పాడు. దూకుడు యువరాజ్ మాదిరిగానే ఉందని చెప్పాడు. మార్చి 27, 2011లో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. అదే ఏడాది ఎం.ఎస్. ధోనీ నాయకత్వంలో భారత్ ప్రపంచ కప్ విజయం సాధించింది. వైభవ్ క్రికెట్ ప్రయాణం ముందుగానే ప్రారంభమైంది. అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ బీహార్ లో సమస్తిపూర్ లో ఓ రైతు. అతని కుమారుడికి ఉన్న క్రికెట్ నైపుణ్యాలను నాలుగేళ్ల వయస్సులోనే మొదటిసారి గమనించాడు.
సమస్తిపూర్‌లోని స్థానిక అకాడమీలో కోచ్ బ్రజేష్ ఝా ఆధ్వర్యంలో వైభవ్‌ని చేర్చాడు. ఇక ఆ తరువాత మనీష్ ఓజా ఆధ్వర్యంలో శిక్షణను పాట్నాకు తరలించారు. ప్రతీరోజు ప్రత్యామ్నాయంగా 90 కి.మీ. సంజీవ్ తన కుమారుడికి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండేలా ఓ కారును కొన్నాడు. 14 సంవత్సరాల వయస్సుల్లోనే వైభవ్ ఇప్పటికే హేమన్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీ, ఛాలెంజర్స్ ట్రోఫీ (U-19) ఏసీసీ అండర్ -19 ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నమెంట్లలో తనదైన ముద్ర వేశాడు. ఈ సీజన్ లో ఐపీఎల్ లో నిన్న గుజరాత్ టైటాన్స్ పై ఆఢిన కీలక ఇన్నింగ్స్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు వైభవ్. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి భారత్ తరపున రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైభవ్ గురించి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.