Indian Railways Employees Holidays: రైల్వేలో ఉద్యోగం అనేది అంత ఆశామాషీ వ్యవహారం కాదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే, అదే స్థాయిలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇండియన్ రైల్వేలో ఓ సాధారణ ట్రాక్ మెన్ 8 నెలలు కష్టపడితే 12 నెలల సాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏంటి ఏడాదిలో నాలుగు నెలలు సెలవులు ఉంటాయా? అని ఆశ్చర్యపోకండి. కచ్చితంగా ఉంటాయి. ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైల్వేలో గ్రూప్ Dలో ట్రాక్ మెన్ అనే పోస్టును ఇప్పుడు ఉదాహారణగా తీసుకుందాం. ఈ ట్రాక్ మెన్ ను బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ రైల్వేగా పిలుస్తుంటారు. సాధారణంగా వీళ్లు 24 గంటలు డ్యూటీ చేయాలి. వీకాఫ్ ఉండదు. రెస్ట్ ఉండదని చాలా మంది భావిస్తుంటారు. ఒకవేళ మీరూ అలాగే అనుకుంటే, పొరపాటు పడినట్లే. అయితే, ఈ ట్రాక్ మెన్ లీవ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
రైల్వేలో సెలవులు
⦿క్యాజువల్ లీవ్స్ (CL-10): ఇవి ఏడాదికి 10 ఇస్తారు. వీటిని కచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి మరుసటి ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ కావు.
⦿లీవ్ ఆన్ యావరేజ్ పే(LAP-30): ఇవి 6 నెలలకు 15 చొప్పున ఏడాదికి 30 ఉంటాయి. ఇవి మనం వాడుకోపోతే నెక్ట్స్ ఇయర్ కు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలా రిటైర్మెంట్ వరకు వెళ్లి చివరకు అమౌంట్ ఇస్తారు. ఇది బేసిక్ సాలరీని బట్టి ఉంటుంది. వీటిని చాలా మంది వాడుకోరు. ఎందుకంటే రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ అమౌంట్ వస్తుంది అలాగే ఉంచుకుంటారు.
⦿లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే(LHAP- 20): వీటిని సిక్ లీవ్స్ అని కూడా అంటారు. ఇవి ఏడాదికి 20 ఉంటాయి. ఆరోగ్యం బాగా లేనప్పుడు రైల్వే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే.. అన్ని రోజులకు హాఫ్ సాలరీ ఇస్తారు. ఇవి వాడకపోతే తర్వాతి ఏడాదికి ఫార్వర్డ్ అవుతాయి.
Read Also: బాబోయ్.. ఒక్క రోజులో ఇండియన్ రైల్వే ఆదాయం అన్నికోట్లా?
⦿నేషనల్ హాలీడే(NH-12): ఇవి ఏడాదికి 12 ఉంటాయి. వీటిలో 6 కచ్చితంగా ఇస్తారు. అవసరం ఉంటే మిగతావి కూడా వాడుకునే అవకాశం ఉంటుంది.
⦿వీక్లీ రెస్ట్(WR-52): రైల్వేలో కచ్చితంగా వీక్లీ ఆఫ్ ఉంటుంది. ఆదివారం, లేదంటే శనివారం సెలవు తీసుకోవచ్చు. ఒక యూనిట్ కు సండే ఆఫ్ ఇస్తే, మరో యూనిట్ కు శనివారం సెలవు ఇస్తారు. మొత్తంగా ఇవి ఏడాదికి 52 ఉంటాయి.
Read Also: ఓహో.. మెయిల్ ఎక్స్ ప్రెస్ పేరు ఇలా వచ్చిందా? సూపర్ ఫాస్ట్ , మెయిల్ మధ్య తేడాలు ఇవే!
8 నెలలు పని చేస్తే, 4 నెలలు రెస్ట్!
సో మొత్తంగా సెలవులను కూడితే 124 సెలవులు పొందే అవకాశం ఉంటుంది. అంటే, రైల్వేలో ఓ సాధారణ ట్రాక్ మెన్ 8 నెలలు పని చేస్తే 12 నెలల సాలరీ పొందే అవకాశం ఉంటుంది. నాలుగు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ సెలవులు ఎక్కడుంటాయి చెప్పండి.
Read Also: దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లు ఇవే.. సికింద్రాబాద్ ఏ స్థానంలో ఉందంటే?