Yograj Singh: ఇటీవల కాలంలో మాజీ క్రికెటర్ల పై విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్. ఇతడు ఓ మాజీ క్రికెటర్ మాత్రమే కాకుండా కోచ్ గాను బాధ్యతలు నిర్వహించేవాడు సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనిని తరచూ విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు యోగరాజ్ సింగ్. తన కుమారుడు యువరాజ్ సింగ్ కెప్టెన్ కాకపోవడానికి, రిటైర్మెంట్ తీసుకోవడానికి కూడా ధోనినే కారణమని అతని వాదన.
Also Read: IND vs Eng T20i: ఎల్లుండి నుంచే ఇంగ్లాండ్, టీమిండియా టీ20 సిరీస్..టైమింగ్, ఫ్రీగా చూడాలంటే ?
అయితే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి వార్తలలో నిలిచాడు యోగరాజ్ సింగ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల టీమిండియాలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2009 సంవత్సరానికంటే ముందు ఉన్న కఠిన రూల్స్ ని మళ్లీ తీసుకువచ్చింది బిసిసిఐ. ఆటగాళ్లకు కొత్తగా పది రూల్స్ ని పెట్టింది. భారత జట్టు పేలవ ప్రదర్శన పై బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకుంది.
బీసిసిఐ ప్రవేశపెట్టిన పది నిబంధనలలో ఆటగాళ్లు ఏదైనా సిరీస్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వారి వెంట భార్య, పిల్లలను తీసుకువెళ్లడంపై ఆంక్షలు విధించింది. అయితే బీసీసీఐ తీసుకువచ్చిన ఈ నిబంధన పై స్పందించారు యోగరాజ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” ఈ టోర్నీ కోసం బీసీసీఐ మంచి ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ విషయంలో బీసీసీఐ తో పాటు సెలెక్టర్లను నేను అభినందించాలని అనుకుంటున్నాను.
కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా గిల్ వ్యవహరించబోతున్నారు. గిల్ భవిష్యత్తులో మంచి నాయకత్వం వహించగలరు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తో వరుసగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో భారత జట్టు పరాజయం తర్వాత బీసీసీఐ జట్టును మరింత పట్టిష్టంగా మారుస్తుంది. ఇందుకోసం కఠిన రూల్స్ ని రూపొందించింది ఈ నిబంధనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై కూడా ఆంక్షలు ఉన్నాయి.
Also Read: Rinku Singh Father: తండ్రికి రూ.3.19 లక్షల విలువైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన రింకూ !
మ్యాచ్ కోసం జట్టు సభ్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి భార్యా, పిల్లలు ఉండాల్సిన అవసరం ఏంటి..? రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్లతో కావలసినంత సమయం గడపవచ్చు. కానీ దేశం కోసం ఆడే సమయంలో వీరంతా అదనపు భారమే అవుతారు. అలాంటప్పుడు వారు మీతో ఎందుకు ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు జట్టే మీ కుటుంబం”. అన్నారు యోగరాజ్ సింగ్.
#WATCH | Chandigarh: On the team announced for the Champions Trophy and ODI series, former Indian cricketer Yograj Singh said, “I really want to congratulate BCCI and selectors who supported the team… I have always said that Rohit Sharma and Virat Kohli should not be dropped,… pic.twitter.com/C613TrxUU5
— ANI (@ANI) January 20, 2025