Kalyan Ram: నందమూరి కుటుంబం అంటే తెలుగు సినీ ప్రేక్షకులకి ఓ ప్రత్యేక స్థానం. తెరపై వీళ్ల స్టామినా మామూలు కాదు. ఇప్పుడు, ఈ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు – ఒక్కరు వంటలో టైగర్, ఇంకొకరు తెరపై టచ్ చేసే ఎమోషన్‌తో మరోసారి ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు.
ప్రస్తుతం అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్, తన తమ్ముడు ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. “తమ్ముడు వంట బాగా చేస్తాడు. మటన్ అయితే అదిరిపోతుంది” అంటూ ఫుడ్ లవర్స్‌కి నోరు ఊరించేలా కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ వంట గురించి ఇంతకముందు రానా, చరణ్ లాంటి వాళ్లు కూడా చెప్పడం విశేషం. గతంలో బిగ్ బాస్ సీజన్ 1 షోలో కూడా ఎన్టీఆర్ వంట చేసి కాంటెస్టెంట్ లకి పెట్టాడు.
ఇక సినిమాలోకి వస్తే… అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కళ్యాణ్ రామ్‌కు అమ్మగా నటిస్తున్నది లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి. చాలా కాలం తరువాత విజయశాంతి పోలిస్ యూనిఫామ్ వేసి ఫైట్స్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం. వింటేజ్ వైబ్స్ ఇస్తున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో విజయశాంతి కీ రోల్ ప్లే చేస్తుందట. మూవీ ట్రైలర్‌లో ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలైట్‌గా నిలిచాయి.
ట్రైలర్ రిలీజైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. విజువల్స్, బీజీఎం, కళ్యాణ్ రామ్ డైలాగ్స్… అన్నీ కలిపి ఇది ఒక పవర్‌ఫుల్ మదర్-సన్ ఎమోషనల్ డ్రామా అనే ఫీల్ కలిగిస్తోంది. ముఖ్యంగా “ఆయుధంలా పెంచి యుద్ధం చెయ్యొద్దు అంటే ఎలా” అనే డైలాగ్ కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా ఉంది. ఓవరాల్ గా అన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా ఉండడంతో నందమూరి అభిమానులు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాపై అంచనాలు పెంచుకున్నారు.
విజయశాంతి – కళ్యాణ్ రామ్ హార్ట్‌ఫుల్ పర్ఫామెన్స్, ఇంటెన్స్ స్టోరీలైన్, మదర్ సెంటిమెంట్ మిక్స్‌తో ఈ సినిమా ఏప్రిల్ 18న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు మళ్లీ ఓ బిగ్ కమర్షియల్ & ఎమోషనల్ హిట్ ఇస్తుందా? అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే. అంచనాలు బాగానే ఉన్నాయి కాబట్టి మంచి ఓపెనింగ్స్ అయితే రావడం గ్యారెంటీ.