Mosquito Remedies: చాలా మంది ఇంట్లో దోమల సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచినప్పటికీ దోమలు ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. చాలా సార్లు ఇంట్లో మొక్కలు ఉన్న లేదా నీరు పేరుకుపోయిన ప్రదేశాలలో దోమలు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. దోమల కారణంగా, డెంగ్యూ, మలేరియా , చికున్ గున్యా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే దోమలను తరిమి వేయడానికి కొన్ని రకాల రసాయనాలు ఉన్న స్ప్రే, లిక్విడ్ లతో పాటు జెట్ కాయిన్ లను కూడా ఉపయోగిస్తుంటారు. రసాయనాలను కలిగి ఉన్న అనేక రకాల దోమలను చంపే ప్రొడక్ట్స్ వాడటానికి బదులుగా కొన్ని సహజ, హోం రెమెడీస్ వాడటం అలవాటు చేసుకోండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ- ఆవాల నూనె:
దోమలను వదిలించుకోవడానికి నిమ్మకాయ, ఆవ నూనె ఒక ప్రభావ వంతమైన హోం రెమెడీ అని చెప్పొచ్చు. ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి, దాని గుజ్జును తీయండి. తరువాత, దాని తొక్కలపై ఆవాల నూనె, లవంగాలు , కర్పూరం వేసి కాల్చండి. ఇలా చేయడం వల్ల దోమలు దూరంగా వెళ్లిపోతాయి. క్షణాల్లోనే దోమల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులు:
ఔషధ గుణాలతో నిండిన తులసి, ఆరోగ్య సంబంధిత సమస్యలకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా దోమలను తరిమికొట్టడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. దోమలను ఇంట్లో నుండి తరిమి కొట్టడానికి, ఇంటి తలుపులు, కిటికీలపై తులసి ఆకులను ఉంచండి. ఇలా చేయడం వల్ల దోమలు వెంటనే పారిపోతాయి. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుంది.
కాఫీ స్ప్రే:
కాఫీ అలసటను తొలగించడంలో మాత్రమే కాకుండా, ఇంటి నుండి దోమలను తరిమికొట్టడంలో కూడా సహాయపడుతుంది. దోమలు కాఫీ యొక్క వాసనను అస్సలు ఇష్టపడవు. ఈ నివారణను కోసం ఒక సీసాలో నీటిని నింపి, దానిలో 1 చెంచా కాఫీ వేసి, స్ప్రేని సిద్ధం చేయండి. ఇంటి మూలల్లో, దోమలు ఉన్న చోట ఈ స్ప్రే చల్లడం వల్ల తక్కువ సమయంలోనే దోమలు పారిపోతాయి. అంతే కాకుండా ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
వెల్లుల్లి:
వెల్లుల్లి దోమలను తరిమికొట్టడానికి ఒక ప్రభావ వంతంగా పని చేస్తుంది. దీని కోసం, 2 నుండి 4 వెల్లుల్లి రెబ్బలను నలిపి, ఒక గ్లాసు నీటిలో మరిగించాలి. నీరు చల్లబడిన తర్వాత, దానిని స్ప్రే బాటిల్‌లో నింపి నిల్వ చేయండి. సాయంత్రం పూట ఈ నీటిని దోమలు ఉన్న చోట చల్లడం ద్వారా పూర్తిగా పారిపోతాయి.
లావెండర్:
లావెండర్ మనోహరమైన సువాసనకు మాత్రమే కాకుండా ప్రభావ వంతమైన దోమల నివారిణిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీని ఘాటైన సువాసన దోమలను ఇంట్లో నుండి తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. మీరు దీన్ని సహజ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దోమలు దగ్గరకు రాకుండా గదిలో కూడా దీనిని స్ప్రే చేయవచ్చు.
Also Read: నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా ?
వెనిగర్:
వెనిగర్ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది దోమలను తరిమి కొట్టడంలో చాలా ప్రభావ వంతంగా పని చేస్తుంది యి. కోసం, ఒక స్ప్రే బాటిల్‌లో 3 కప్పుల నీరు మరియు 1 కప్పు వెనిగర్ కలపండి. దోమలను దూరంగా ఉంటాయి. ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై స్ప్రే చేయండి లేదా ఇంటి లోపల, చుట్టు పక్కల కూడా చల్లుకోండి.
టీ ట్రీ ఆయిల్:
టీ ట్రీ ఆయిల్ దోమలను తరిమికొట్టడానికి ఒక ప్రభావ వంతమైన , సహజమైన నివారణ. దీనిని నీటితో కలిపి స్ప్రేగా ఉపయోగించవచ్చు. లేదా చర్మానికి నేరుగా అప్లై చేయవచ్చు. ఇది దోమల నుండి రక్షించడమే కాకుండా చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది సురక్షితమైన , ఉపయోగకరమైన ఎంపిక అని చెప్పవచ్చు.