Saqlain Mushtaq On Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) గురించి తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ (Saqlain Mushtaq) సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌరవ్ గంగూలీ అంటే తనకు అస్సలు నచ్చదని.. అతని ముఖం చూడాలన్న చిరాకు వచ్చేది అంటూ బాంబు పేల్చారు. కానీ ఆ తర్వాత సౌరవ్ గంగూలీ చాలా మంచోడు అని, తనకు జ్ఞానోదయం అయినట్లు వివరించారు. అనవసరంగా సౌరవ్ గంగూలీని కించపరిచేలా చాలా సార్లు వ్యవహరించాలని గుర్తు చేశారు. తనకు గాయం అయినప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఎవరు పట్టించుకోలేదు..కానీ అలాంటి సమయంలో సౌరవ్ గంగూలీ తన దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడాడని, అలాంటోడిని తాను తప్పుగా అర్థం చేసుకున్నానని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. దీంతో సౌరవ్ గంగూలీపై సక్లైన్ ముస్తాక్ (Saqlain Mushtaq) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిడియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ (Saqlain Mushtaq) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సౌరవ్ గంగూలీని చాలా సార్లు అసహ్యించుకున్నానని.. అతడి ముఖం నాకు చిరాకు తెప్పించేదని బాంబు పేల్చారు. కానీ ఆ తర్వాత సౌరవ్ గంగూలీ క్యారెక్టర్ గురించి తెలుసుకొని.. అతన్ని గౌరవించడం మొదలు పెట్టానని వివరించారు. సౌరవ్ గంగూలీ అసలు స్వరూపం తెలియక, అతడు కోపిష్టి, ఒళ్లంతా పొగరే అనే అభిప్రాయంలో తాను ఉండేవాడినని గుర్తు చేశారు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత సౌరవ్ గంగూలీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే తాను నిరాకరించే వాడినని తెలిపారు. అసలు మ్యాచ్ అయిన తర్వాత అతన్ని కలవకుండానే డ్రెస్సింగ్ రూమ్ వెళ్లే వాడిందని చెప్పుకొచ్చారు. తనతో మాట్లాడేందుకు సౌరవ్ గంగూలీ చాలా సార్లు ప్రయత్నించాడని… కానీ తాను పట్టించుకోలేదని వివరించారు.
గతంలో 8 నెలల పాటు గాయం కారణంగా పాకిస్తాన్ జట్టుకు తాను దూరం అయ్యానని ముస్తాక్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఆ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు తమ క్రికెటర్లు ఎవరూ కూడా తన గురించి పట్టించుకోలేదని గుర్తు చేశారు. తనను అవమానిస్తూ మాట్లాడారు తప్ప.. ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదని వెల్లడించారు. కానీ సౌరవ్ గంగూలీ ఒక్కడు మాత్రం.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు తన వద్దకు వచ్చాడన్నారు. బాల్కనీలో కూర్చున్న తన దగ్గరకు వచ్చినట్లు వివరించారు. అతని రెండు చేతుల్లో ఉన్న ఒక కాఫీని… తనకు ఇచ్చాడని గుర్తు చేశారు ముస్తాక్. గాయం గురించి ఆరా తీశాడని తెలిపారు. కోలుకున్నాక పాకిస్తాన్ జట్టులో అద్భుతంగా రాణిస్తావని… ఆ నమ్మకం తనకు ఉన్నట్లు భరోసా నింపే ప్రయత్నం చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో అతడిని అసహ్యించుకున్న విషయాన్ని గుర్తు చేసి.. సౌరవ్ గంగూలీకి క్షమాపణలు కూడా చెప్పినట్లు వివరించారు.