E-Paper
Advertisement

యమహా కొత్త బైక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

యమహా కొత్త బైక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

New Yamaha R2 Launched: స్పోర్ట్స్ బైక్‌లను ఇష్టపడే వారికి యమహా మరో గుడ్‌ న్యూస్ చెప్పింది. కొత్త YZF-R2ను మార్కెట్లోకి విడుదల చేసింది. R15 కంటే పవర్ ఫుల్ గా ఈ బైక్‌ను రూపొందించింది. కొత్త ఇంజిన్, అధునాతన ఫీచర్లు, తక్కువ బరువుతో R2ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడు వేరియంట్లలో లభించే ఈ బైక్‌ కు ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

R15 కంటే పై రేంజ్ లో R2

యమహా స్పోర్ట్‌ బైక్ లైనప్‌ లో R15కి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే ఫ్యామిలీలో R2 చేరింది. అయితే R2ను కేవలం R15కు పెద్ద వెర్షన్‌ గా కాకుండా కొత్త ప్లాట్‌ ఫామ్‌ పై అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. MT-15, XSR 155, R15 లాంటి  మోడళ్లతో పాటు R2 కూడా యమహా లైనప్‌ లో కొనసాగనుంది. కొత్త మోడల్ కోసం రూ.10,000 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది.

204cc కొత్త ఇంజిన్

Advertisement

R2లో 204cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, DOHC ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 10,000rpm దగ్గర 26.5hp పవర్, 8,000rpm దగ్గర 19.3Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ లోని వాల్వ్‌ లకు DLC అంటే డైమండ్ లైక్ కార్బన్ కోటింగ్‌ ను అందించారు. ఇలాంటి టెక్నాలజీ గతంలో యమహా ఫ్లాగ్‌ షిప్ మోడల్ YZF-R1లో కూడా కనిపించింది. దీంతో చిన్న స్పోర్ట్స్ బైక్ అయినప్పటికీ R2లో పెర్ఫార్మెన్స్‌ పై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పవర్ విషయంలో KTM RC 200, హీరో కరిజ్మా XMR లాంటి బైక్‌ లతో పోటీపడేలా R2ను సిద్ధం చేశారు. ప్రత్యర్థులతో పోలిస్తే కొంత ఎక్కువ పవర్‌ను అందిస్తూ, దాదాపు సమానమైన టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లలోనూ ప్రత్యేకత గుర్తింపు

యమహా R2లో ఫీచర్లకు కూడా కొదవ లేదు. రైడ్ బై వైర్ థ్రాటిల్, మూడు రైడ్ మోడ్‌లు, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, 37mm USD ఫోర్కులు, డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లు స్టాండర్డ్‌ గా లభిస్తాయి. అంతేకాకుండా R15 Mలో కనిపించే 5 అంగుళాల TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా R2లో ఉన్నాయి. దీంతో బైక్‌ను టెక్నాలజీ పరంగా కూడా ప్రీమియం మోడల్‌ గా మార్చారు. R2ను మొత్తం మూడు వేరియంట్లలో అందిస్తున్నారు. రెండో వేరియంట్‌లో బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, బాడీ కలర్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ సెగ్మెంట్‌ లో బై డైరెక్షనల్ క్విక్‌ షిఫ్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. టాప్ వేరియంట్ R2 Mలో అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ సస్పెన్షన్, బ్రేక్, క్లచ్ లివర్లు, ఫాక్స్-స్వెడ్ సీటు, స్మార్ట్ కీలెస్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.

ధర, డెలివరీ గురించి..

Advertisement

యమహా R2 బేస్ వేరియంట్ ధర రూ.2.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ R2 M ధర రూ.2.53 లక్షలుగా ఉంది. ఈ బైక్‌ను యమహా బ్లూ స్క్వేర్ నెట్‌ వర్క్ ద్వారా మాత్రమే విక్రయించనుంది. ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు సెప్టెంబర్ మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి.

Read Also: పండుగ సీజన్‌ కు ముందే బజాజ్ బిగ్ ప్లాన్.. ఏకంగా 6 కొత్త బైక్‌లు రెడీ!

Tags

Related News

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

Big Stories

Advertisement
×