Afghan Fans Warns India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. లీగ్ దశలో సెమీఫైనల్ బెర్త్ కోసం నేడు ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా జట్లు పోటీ పడబోతున్నాయి. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టును ఇంటి ముఖం పట్టించిన ఆఫ్గనిస్తాన్ జట్టు.. నేడు మరో సంచలన విజయాన్ని నమోదు చేసి ముందుకు వెళుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ జట్టు గెలిస్తే సెమీఫైనల్స్ కి వెళుతుంది.
బుధవారం రోజు ఇంగ్లాండ్ – ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన పోరులో.. తనకంటే బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించడమే కాకుండా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి ఇంగ్లాండ్ జట్టును బయటకు పంపించేసింది ఆఫ్గనిస్తాన్. లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోను అదరగొట్టింది. చివరి వరకు సాగిన హోరాహోరీ మ్యాచ్లో అఫ్గానిస్థాన్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకొని.. నేడు ఆస్ట్రేలియాపై విజయం సాధించి సెమీస్ లోకి ప్రవేశించాలని పట్టుదలతో ఉంది.
నేడు జరిగే మ్యాచ్ లో రికార్డ్ సెంచరీ చేసిన ఇబ్రహీం జద్రాన్, ఐదు వికెట్లు పడగొట్టిన అజ్మతుల్లా ఓమర్జాయ్ అఫ్గాన్ జట్టుకు కీలకం కానున్నారు. మరోవైపు రెండుసార్లు ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ లో అడుగు పెట్టాలని భావిస్తోంది. అయితే ఆఫ్గనిస్తాన్ జట్టును తేలికగా తీసుకుంటే ఆస్ట్రేలియా మూల్యం చెల్లించుకోక తప్పదు. నేడు మ్యాచ్ జరగబోయే గడాఫీ స్టేడియం లోని పిచ్ బ్యాటర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. గ్రూప్ ఏ నుండి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ లో అడుగుపెట్టాయి. అయితే నేడు జరగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయాన్ని సాధించి.. ఫైనల్ లో భారత్ ని చిత్తు చేస్తుందని జోష్యం చెబుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ క్రీడాభిమానులు. బుధవారం ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ జట్టు ఘన విజయం సాధించడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు ఖుషిగా ఉన్నారు. ఇంగ్లాండ్ పై విజయం సాధించిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ క్రీడాభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చుతూ, డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
అయితే అదే ఖుషి లో తాజాగా కొందరు ఆఫ్ఘాన్ క్రీడాభిమానులు భారత జట్టును ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అన్ని జట్లకు ఓటమి రుచి చూపించామని.. ఇక ఒక్క ఇండియానే మిగిలిందని అన్నారు. ఆ జట్టు ను ఫైనల్ లో దుబాయిలో ఓడిస్తామని తెలిపారు. ఆస్ట్రేలియా, ఇండియాలే కాదు.. తమ జట్టు ముందు ఏ జట్టు నిలవలేదని చెబుతున్నారు. ఇలా ఆఫ్గనిస్తాన్ క్రీడాభిమానులు ఇచ్చిన వార్నింగ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో పై స్పందిస్తున్న భారత క్రీడాభిమానులు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలవాలని కోరుకోవడం కరెక్టే కానీ.. అతి విశ్వాసం పనికిరాదని వారిపై ఫైర్ అవుతున్నారు.
Passionate Afghanistan fan says India cannot defeat Afghanistan and India do not play better cricket than them. “Afghanistan have come to defeat India and win Champions Trophy” 🇮🇳🇦🇫🔥🔥
Watch full video 👇🏽https://t.co/FiRgDvsmvu pic.twitter.com/7YfzNNHIyx
— Farid Khan (@_FaridKhan) February 26, 2025