BigTV English

Afg vs Eng: 177 పరుగులతో రెచ్చిపోయి ఇబ్రహీం కొత్త చరిత్ర … ఇంగ్లాండ్ ముందు కొండంత టార్గెట్ ?

Afg vs Eng: 177 పరుగులతో రెచ్చిపోయి ఇబ్రహీం కొత్త చరిత్ర … ఇంగ్లాండ్ ముందు కొండంత  టార్గెట్ ?

Afg vs Eng: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య పోరు జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీమ్… భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో…. ఏడు వికెట్లు నష్టపోయి 325 పరుగులు చేసింది ఆఫ్గనిస్తాన్. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడిన ఆఫ్గానిస్తాన్… ఆ తర్వాత విజృంభించింది. ముఖ్యంగా… ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం అద్భుతమైన సెంచరీతో రాణించాడు. ఈ తరుణంలోనే… ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేసింది.


 

అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం 150 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. చాంపియన్స్ ట్రోఫీ లో 150 పరుగులు చేసిన ఏకైక ఆసియా ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహిం.  ఇవాల్టి మ్యాచ్ లో సిక్స్ లు, బౌండరీలతో దుమ్ము లేపాడు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం. ఈ తరుణంలోనే 177 పరుగులు చేసి చివరి ఓవర్ లో అవుట్ అయ్యాడు.  146 బంతుల్లో 177 పరుగులు చేసిన ఇబ్రహీం… 12 బౌండరీలు అలాగే ఆరు సిక్సర్లు కొట్టాడు.  కానీ 49.1 ఓవర్ వద్ద ఇంగ్లాండ్ ఆటగాడు లివింస్టన్ బౌలింగ్లో ఆర్చర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లలో… ఆ జట్టు కెప్టెన్ షాహీదీ 40 పరుగులు చేయగా…ఒమార్జయి 41 పరుగులు చేసి రాణించారు. చివర్లో ఆల్ రౌండర్ మహమ్మద్ నబి కూడా 24 బంతుల్లో 40 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో 325 పరుగులు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ ఒక్కడే 3 తీశాడు. లివింగ్ స్టన్ కు రెండు వికెట్లు పడ్డాయి. ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. ఇక ఇంగ్లాండ్ 326 పరుగులు చేస్తేనే సెమీఫైనల్ బరిలో ఉంటుంది. లేకపోతే ఇంటి దారి పట్టడమే.


ఇది ఇలా ఉండగా…ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుకు సెమిస్ అవకాశాలు మెరుగవుతాయి. నిన్న దక్షిణఫ్రికా vs ఆస్ట్రేలియా మధ్య జరుగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ రద్దు కావడంతో దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దాంతో దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా ఖాతాలో చెరో 3 పాయింట్స్ వచ్చి పడ్డాయి. దిం తో గ్రూపు B లో…ఉన్న సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇంగ్లాండ్.. జట్లకు సెమిస్ వెళ్లే ఛాన్స్ వచ్చింది. అందుకే ఇవాళ జరుగుతున్న ఆఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ జరిగే మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇవాల్టి మ్యాచ్ లో గెలిచిన జట్టు కచ్చితంగా సెమిస్ ఛాన్స్ లు ఎక్కువ. ఓడిన జట్టు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇంగ్లాండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ రెండు జట్లు కూడా… పోరాడుతున్నాయి. ఇందులో ఏ జట్టు గెలిచినా.. రెండు పాయింట్లు సాధిస్తుంది. మళ్లీ ఈ రెండు జట్లకు మరొక మ్యాచ్ ఉంది. అక్కడ కూడా తెలిస్తే నేరుగా సెమీ ఫైనల్ కు వెళ్తాయి.

Related News

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×