Chiranjeevi in Ind vs Pak match: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో.. చాలామంది సెలబ్రిటీలు మ్యాచ్ చూసేందుకు వచ్చారు. మన ఇండియా నుంచి లక్షలు పెట్టి మరి.. టికెట్టు కొనుగోలు చేసి మ్యాచ్ తిలకిస్తున్నారు. ఇందులో భాగంగానే… టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు, ఏపీ రాజకీయ నాయకులు కూడా దుబాయ్ స్టేడియంలో దర్శనమిచ్చారు.
Also Read: Ind vs Pak: దుబాయ్ లో కుప్పకూలిన పాక్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే ?
ముఖ్యంగా టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు ( Pakistan vs Team India )… మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) రావడం జరిగింది. కాంగ్రెస్ నేతలతో ఫోటోలు… దిగిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత… స్టేడియం లో కూర్చున్నారు. అనంతరం టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) పక్కన మెగాస్టార్ చిరంజీవి కూర్చోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీ రాజకీయ నాయకులు కూడా… ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చారు.
చంద్రబాబు నాయుడు కొడుకు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ), టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( Kesineni Chinni ) కూడా ఈ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. వీరితోపాటు దర్శకుడు సుకుమార్ కూడా… దుబాయ్ స్టేడియానికి రావడం జరిగింది. తన కుటుంబంతో కలిసి దుబాయ్ స్టేడియానికి వచ్చారు దర్శకుడు సుకుమార్. అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే సుకుమార్… ఇద్దరు ఫార్మల్ బ్లాక్ డ్రెస్ లో ఉంటే… నారా లోకేష్ అలాగే టిడిపి ఎంపీ కేశినేని శివనాథ్ ( Kesineni Chinni ) … మాత్రం టీమిండియా జెర్సీ ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: IND VS PAK: పాకిస్తాన్ తో మ్యాచ్… మిస్టరీ ప్లేయర్ తో బరిలోకి టీమిండియా.. జట్ల వివరాలు ఇవే!
ఇది ఇలా ఉండ గా…. టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో…. మహమ్మద్ రిజ్వాన్ టీం కష్టాల్లో ఉంది. మొదట్లో బాగా ఆడిన పాకిస్తాన్ టీం… మిడిల్ లో వికెట్లను కోల్పోయింది. దాదాపు 250 కి లోపే.. టీమిండియా ముందు టార్గెట్ ఉంచే ఛాన్స్ లు ఉన్నాయి. పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు బాబర్ మరోసారి విఫలమయ్యాడు. హార్థిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ క్యాచ్ అయ్యాడు బాబర్. అయితే షకీల్ మాత్రం 76 బంతుల్లో 62 పరుగులు చేసి దుమ్ము లేపాడు. పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అటు టీమిండియా బౌలర్లలో…. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా… కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు.