CT 2025 Semi-finals: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) నేపథ్యంలో… సెమీ ఫైనల్ బెర్తుల విషయంలో ( CT 2025 Semi-finals ) కొత్త సమస్య వచ్చి పడింది. నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ( South Africa vs Australia ) మధ్య జరగాల్సిన రావల్‌పిండి ( Rawalpindi) మ్యాచ్ వర్షం ( Rain ) కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో దక్షిణాఫ్రికా ఖాతాలో మూడు పాయింట్లు, ఆస్ట్రేలియా ఖాతాలో మూడు పాయింట్లు చేరిపోయాయి. కానీ రన్ రేటు ప్రకారం దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంటే… రెండవ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.
ఇక మూడవ స్థానంలో ఒక మ్యాచ్ గెలవని ఇంగ్లాండు ( England ), నాలుగో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అయితే ఇవాళ… ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Afghanistan vs England) మధ్య మ్యాచ్.. జరగబోతుంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది. గడాఫీలో ఇవాళ వర్షం పడే ఛాన్సులే లేవు. కాబట్టి.. మ్యాచ్ రిజల్ట్ కచ్చితంగా వస్తుంది. ఇలాంటి తరుణంలోనే… ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టీం గెలిచే చాన్సులు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. అదే గెలిచిన జట్టు మాత్రం…. సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే 2 పాయింట్లు వస్తాయి. దీంతో సెమీస్ వెళ్లే ఛాన్సులను మెరుగు పరుచుకుంటుంది ఇంగ్లాండ్ టీం.
Also Read: IPL 2025: ఐపీఎల్ ఆడే టీమిండియా ప్లేయర్లకు షాక్..BCCI కొత్త రూల్స్..ఇక నరకమే !
అదే సమయంలో ఇంగ్లాండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మార్చి 1వ తేదీన దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ కరాచీ నేషనల్ స్టేడియంలో ఉంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే అవుతుంది. ఒక వేళ సౌతాఫ్రికా ఓడి.. ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే..సౌతాఫ్రికాకు పరిస్థితి జటిలం అవుతుంది. అటు ఇంగ్లాండ్ చేతిలో 3 పాయింట్స్ వస్తాయి. అదే సమయంలో రన్ రేట్ విషయంలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా గట్టిగా పోరాడాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే… ఇంగ్లాండ్ చేతిలో ఓడినా కూడా సౌతాఫ్రికాకు ఛాన్సు ఉంటుంది. ఎలా అంటే… ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ లో కంగారులు దారుణంగా ఓడినా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ కు సెమీస్ ఛాన్సులు పెరుగుతాయి. అప్పుడు కూడా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ రన్ రేట్ పెంచుకోవాలి.
ఇదే జరిగితే… రన్ రేట్ పరంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సెమీస్ కు వెళతాయి. అలా కాదనీ ఇవాళ్టి మ్యాచ్ లో అఫ్ణనిస్తాన్ గెలిస్తే… మరో మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉంటుంది. అక్కడ గట్టి పోటీనే ఉంటుంది. ఆసీస్ పైన కూడా గెలిస్తే… అఫ్ణనిస్తాన్ కు ఛాన్సు ఉంటుంది. మొత్తానికి చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) గ్రూప్ బీలో ఉన్న ఆసీస్, సౌతాఫ్రికా, అఫ్ణనిస్తాన్ అలాగే ఇంగ్లండ్ ఇలా నాలుగు జట్లకు సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Afghanistan vs England) మధ్య మ్యాచ్.. జరగబోతుంది. ఇందులో ఓడిన జట్టు మాత్రం ఇంటికే వెళ్లాలి. దాంతో గెలిచిన జట్టు… సౌతాఫ్రికా, ఆసీస్ తో పోటీలో ఉంటాయి.