IPL 2025: టీమిండియా ప్లేయర్లకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) మరోసారి ఇచ్చింది. టీమిండియా ప్లేయర్ల పైన ( Indian players) మరింత ఒత్తిడి పెట్టేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రంగం సిద్ధం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం కానున్న నేపథ్యంలో… తెరపైకి కొత్త రూల్స్ తీసుకొచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఆడబోయే క్రికెటర్లు అందరూ కచ్చితంగా రెడ్ బాల్ తో (Red Ball ) ప్రాక్టీస్ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది బీసీసీఐ (BCCI ). ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఆడుతూనే… టెస్ట్ మ్యాచ్ లపైన ఫోకస్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి.
Also Read: Rachin Ravindra: రావల్పిండి స్టేడియంలో ఉగ్రమూకలు.. రచిన్ రవీంద్రపై దాడి ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో చాలామంది టెస్ట్ గురించి పట్టించుకోవడంలేదని… దీనివల్ల టీమిండియా చాలా టోర్నమెంట్లు కోల్పోయిందని ఓ నివేదిక వచ్చిందట. మొన్నటికి మొన్న బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ , స్వదేశంలో న్యూజిలాండ్ చేతులకు కూడా టీమిండియా ఓడిపోయింది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లు ఓడిపోవడంతో… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంటుకు నుంచి కూడా టీమిండియా వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే ఇలా రెండు సిరీస్ లు ఓడిపోవడంతో… టీమిండియా పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగానే టెస్టుల్లో టీమిండియా ప్లేయర్లు సరిగా ఆడటం లేదని కూడా కొంతమంది వాదించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల 10 కొత్త రూల్స్ తీసుకు వచ్చిందట బీసీసీఐ. విదేశీ టూర్లకు టీమిండియా ప్లేయర్ల భార్యలను తీసుకువెళ్లకూడదని.. ప్రవేట్ సిబ్బంది ఖర్చు భరించుకోవాల్సిందేనని ఇటీవల… బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: SA vs Aus: భారీ వర్షం.. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు..టీమిండియాకు పెను ప్రమాదం !!
అయితే ఐపిఎల్ 2025 త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో… కొత్త రూల్స్ తీసుకొచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ ఆడుతూనే రెడ్ బాల్ తో ప్రాక్టీస్ కూడా చేయాలని టీం ఇండియా ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేసిందట. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో టీమిండియా ప్లేయర్లు షాక్ అవుతున్నారు. ఐపీఎల్ సమయంలో… దూకుడుగా ఆడేందుకు వైట్ బాల్ తో ప్రాక్టీస్ చేస్తాం తప్ప… రెడ్ బాల్ ఏంటని కొంతమంది టీం ఇండియా ప్లేయర్లు తమ నిరసన తెలుపుతున్నారట. ఈ విషయం బయటికి చెప్పకపోయినా లో లోపల అనుకుంటున్నారట. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indi an Premier League 2025 Tournament ) మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… మార్చి 22వ తేదీన మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పోరు ఉండనుందట.
Indian players to multitask during IPL, engaging in red-ball preparations as BCCI aims for a Test cricket revival ahead of the England tour after setbacks against New Zealand & Australia.#IPL2025 #BCCI #IndianCricketTeam #Cricket pic.twitter.com/XZ15QwDn93
— InsideSport (@InsideSportIND) February 25, 2025