BigTV English

Ban vs Pak: పాకిస్తాన్ ను కాపాడిన వరుణుడు.. లేకపోతే బంగ్లా చేతిలో పరువు పోయేదే?

Ban vs Pak: పాకిస్తాన్ ను  కాపాడిన వరుణుడు.. లేకపోతే బంగ్లా చేతిలో పరువు పోయేదే?

Ban vs Pak: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… జరుగుతున్న మ్యాచులు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ   రావల్పిండి స్టేడియం వేదికగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య.. ఇవాళ నామమాత్రపు వన్డే మ్యాచ్ జరగాల్సి ఉండేది. అయితే ఈ మ్యాచ్.. రద్దు అయినట్లు కాసేపటి క్రితమే అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో రావల్పిండి  లో  భారీ వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. టాస్ వాస్తవానికి  మధ్యాహ్నం రెండు గంటలకు వేయాల్సి ఉండేది. కానీ భారీ వర్షం కురవడంతో… అసలు టాస్ వేయకుండా.. మ్యాచ్ రద్దు చేశారు. ఎంతసేపు చూసినా కూడా… టాస్ వేయడానికి అవకాశం రాలేదు. పిచ్ తడిగా మారిపోయింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఇదే పరిస్థితి ఉంది.


 

ఇక ఈ పరిస్థితులను గమనించిన మ్యాచ్ అంపైర్లు… కీలక నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు.. ప్రకటన చేశారు. దీంతో పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్ జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ కు ఒక పాయింట్ అటు బంగ్లాదేశ్ కు ఒక పాయింట్ వచ్చాయి. చెరో పాయింట్ సంపాదించినప్పటికీ కూడా… పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్లకు ప్రయోజనం ఏమి ఉండదు. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో ఇప్పటికే బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ రెండు జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. బంగ్లాదేశ్ ఎలిమినేట్ అయినప్పటికీ… పాకిస్తాన్ మాత్రం ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం… అత్యంత దారుణం. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్.. గ్రూప్ స్టేజీలోనే ఎలిమినేట్ అయింది. దీంతో పాకిస్తాన్ టీం పైన విమర్శలు చాలా వస్తున్నాయి. సొంత గడ్డపై కూడా గెలవని పాకిస్తాన్…. చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఏంటని కొంతమంది అంటున్నారు.


 

ఇక మరికొంతమంది.. పాకిస్తాన్ జట్టులో ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. ఎలిమినేట్ అయినప్పటికీ దుబాయ్ వేదికగా… టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ జట్టు ప్లేయర్ లందరూ చెత్త గాళ్లు అంటూ ఇప్పటికే చాలామంది అభిమానులు కామెంట్స్ కూడా చేశారు. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే కూడా పాకిస్తాన్లో సంబరాలు చేసుకునే అంత వ్యతిరేకత పాకిస్తాన్ టీం పైన వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దు అయింది. దీంతో పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. వర్షం పడకుండా మ్యాచ్ జరిగి ఉంటే…. కచ్చితంగా మా వాళ్ళు ఓడిపోయేవారని… పాకిస్తాన్ అభిమానులే సెటైర్లు పేల్చుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో రెండు మ్యాచ్లు ఆడింది పాకిస్తాన్ టీం. ఇందులో మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. టోర్నమెంట్ ప్రారంభంలోనే ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ జరిగితే…. రోహిత్ సేన గెలిచింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×