Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను దాయాది పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దాదాపు 29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్ ని నిర్వహిస్తుంది. ఆ దేశంలోని మూడు నగరాల్లో రావాల్పిండి, కరాచీ, లాహోర్ లలో ఈ టోర్నీని నిర్వహిస్తోంది. 8 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొనగా.. భద్రతా సమస్యల దృశ్య భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ కి వెళ్లడానికి నిరాకరించడంతో.. టీమిండియా మ్యాచ్లను పూర్తిగా దుబాయ్ వేదికగా నిర్వహిస్తుంది ఐసీసీ.
అయితే {Champions Trophy 2025} పాకిస్తాన్లో నిర్వహిస్తున్న మ్యాచ్ లలో భద్రత గురించి నిరంతరం ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ టోర్ని {Champions Trophy 2025}కి పాకిస్తాన్ సరిగ్గా భద్రత కల్పించడం లేదంటూ విమర్శలు వెలువడుతూనే ఉన్నాయి. పాకిస్తాన్లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఆ దేశ ఇంటలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేయడంతో.. ఆటగాళ్లతో పాటు క్రీడాభిమానులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విదేశీ అతిధులను అపహరించి డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందని ఇంటలిజెన్స్ విభాగం హెచ్చరించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
వెంటనే పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కానీ అందులో కూడా విఫలమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ {Champions Trophy 2025} కి కేటాయించిన భద్రత విధులను నిర్వర్తించడానికి నిరాకరించినందుకు పాకిస్తాన్ లోని పంజాబ్ కి చెందిన 100 మందికి పైగా పోలీసులను సర్వీస్ నుంచి తొలగించింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియం నుండి కేటాయించబడిన హోటళ్లకు ప్రయాణించే జట్లకు భద్రత కల్పించేందుకు పోలీసు అధికారులను నియమించారు. కానీ వారు విధులకు హాజరుకానందున.. వారిని పోస్టుల నుంచి తొలగించినట్లు పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఈ వార్త బయటకి వచ్చి రెండు రోజులు గడవక ముందే భద్రత విషయంలో పాకిస్తాన్ మరోసారి విఫలమైంది. ఫిబ్రవరి 26 బుధవారం రోజున {Champions Trophy 2025} ఆఫ్ఘనిస్తాన్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది మైదానంలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి హడావిడి చేశాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తూ మైదానం అంతా తిరిగాడు. తర్వాత అతడు కొంతమంది క్రికెటర్ల జెర్సీని గట్టిగా పట్టుకుని వదల్లేదు.
ఇక వెంటనే మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన భద్రతా సిబ్బంది.. ఆ చోరబాటుదారున్ని మైదానం నుండి దూరంగా తీసుకువెళ్లారు. ఈ ట్రోఫీలో ఇలా జరగడం ఇది రెండవసారి. ఫిబ్రవరి 24న బంగ్లాదేశ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోను ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకొని వచ్చి న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్రను వెనుక నుండి పట్టుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఓ తీవ్రవాది ఫోటోని పట్టుకొని పరిగెత్తుకు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు {Champions Trophy 2025} మరో వ్యక్తి ఇలా మైదానంలోకి పరిగెత్తుకుంటూ రావడంతో.. ఆటగాళ్లకు భద్రతను పెంచుతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చింది.