PAK Team – ICC CT 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రేపు హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. గ్రూప్ – ఏ లోని భారత్ – పాకిస్తాన్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ పై క్రీడాభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. క్రికెట్ ఫ్యాన్స్ కి అసలైన కిక్ ఇచ్చే ఈ మ్యాచ్ రేపు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది. ఈ ఆసక్తికర పోరును టీవీలో తిలకించేందుకు మీరు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో లైవ్ ద్వారా చూడవచ్చు.
ఇక టీవీలో చూడడానికి వీలుకాని వాళ్లు మొబైల్ లో జియో హాట్ స్టార్ యాప్ లో చూడవచ్చు. ఈ ఐసీసీ టోర్నీలో టీమ్ ఇండియాకి.. పాకిస్తాన్ జట్టుపై తిరుగులేని రికార్డ్ ఉంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టును చిత్తు చేసిన పాకిస్తాన్.. ఆ తరువాత 2021 టీ-20 వరల్డ్ కప్ లోను ఇండియా పై ఘన విజయం అందుకుంది. ఈ రెండు మ్యాచ్ లలోనూ విరాట్ కోహ్లీయే టీమ్ ఇండియా కెప్టెన్. 2021 టీ-20 వరల్డ్ కప్ లో ఇండియా పై విజయం తర్వాత.. 2022 టీ-20 వరల్డ్ కప్ లో ఇండియా.. పాకిస్తాన్ జట్టును ఓడించి రివెంజ్ తీర్చుకుంది.
ఇక చాలాకాలం తర్వాత ఇప్పుడు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇరు జట్లు మళ్లీ తలపడబోతున్నాయి. ఇక ఈ టోర్నీలో టీమిండియా తన మొదటి మ్యాచ్ నీ విక్టరీతో మొదలుపెట్టింది. ఈ టోర్నీలో రెండవ మ్యాచ్ లో ఇండియా – బంగ్లాదేశ్ మధ్య జరిగిన పోరులో టీమిండియా.. బంగ్లాదేశ్ ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఇక తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ కి.. భారత్ తో జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ లో అతిథ్య జట్టు ఓడిపోతే టోర్నీ నుండి దాదాపు నిష్క్రమించినట్లే.
ఒకవేళ భారత్ ఓడితే న్యూజిలాండ్ తో మార్చ్ 2 న జరిగే మ్యాచ్.. భారత్ కి కీలకంగా మారుతుంది. పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉండే జట్లు మాత్రమే క్వాలిఫై అవుతాయి. ప్రస్తుతం గ్రూప్ – ఏ లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉండగా.. టీమ్ ఇండియా టాప్ 2 లో ఉంది. ఇక వన్డే క్రికెట్ లో ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే.. భారత్ పై పాకిస్తాన్ తేలిపోతుందన్నది స్పష్టంగా తెలుస్తోంది. 2010 నుండి చూస్తే ఇరుజట్ల మధ్య 12 వన్డేలు జరిగాయి.
ఇందులో 12 మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. నాలుగు ఇంటిలో భరత్ ఓడిపోగా.. మరో మ్యాచ్ రద్దయింది. ఇక ఓవరాల్ గా వన్డే రికార్డును చూస్తే పాకిస్తాన్ పై చేయి గానే కనిపిస్తోంది. ఇరుజట్ల మధ్య ఓవరాల్ గా 135 వన్డేలు జరగగా.. వీటిలో 73 వన్డేలలో పాకిస్తాన్ గెలుపొందింది. 57 మ్యాచ్ లలో టీమిండియా గెలుపొందింది. అయితే ఇదంతా గత కాలపు ఘనతలే. ప్రస్తుతం పాక్ పరిస్థితి అంతగా లేదు. ఇక ఐసీసీ టోర్నీల విషయానికి వస్తే పాకిస్తాన్ కాస్త పై చేయిగానే నిలిచింది. ఐసీసీలలో ముఖాముఖి పోరులో 3 – 2 తో పాకిస్తాన్ ముందంజలో నిలిచింది. దీంతో ఆదివారం జరగబోయే మ్యాచ్ లో గెలిచి.. లెక్క సరిచేయడంతో పాటు టోర్నీ నుంచి పాకిస్తాన్ ని బయటకు గెంటేయాలని భారత్ పట్టుదలగా ఉంది.