BigTV English
Advertisement

My Fruit Box Scam: ‘ఫ్రూట్ బాక్స్’ పేరుతో ఘరానా మోసం.. సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మితే ఇంతే!

My Fruit Box Scam: ‘ఫ్రూట్ బాక్స్’ పేరుతో ఘరానా మోసం.. సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మితే ఇంతే!

My Fruit Box Scam: హైదరాబాద్ లో రోజు రోజుకీ కొత్త మోసాలు బయటపడుతున్నాయి. ఎవరూ అమాయకంగా కనిపిస్తారో వారిని ఇట్టే మోసం చేస్తారు. భాగ్యనగరంలో రకరకాల మోసాలు చూస్తుంటాం. ఆన్ లైన్ లో మోసాలు, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పేరు వాడుకుని చాలా రకాలుగా ప్రజలను మోసం చేస్తుంటారు. తాజాగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న వారిని మై ఫ్రూట్ బాక్స్ పేరుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్, బోరబండలో చోటుచేసుకుంది.


ALSO READ: IOCL jobs: అలెర్ట్.. టెన్త్, ఇంటర్ అర్హతతో 246 ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు వివిధ పండ్లను సప్లై చేస్తామని ఆన్ లైన్ లో ప్రమోషన్ కూడా చేయించారు. ఫ్రూట్ బౌల్ కు రూ.3000, మినీ ఫ్రూట్ బౌల్ కు రూ.1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఫ్రూట్ డెలివరీ చేయకుండా ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మంది మోసపోయారు.


కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదన్న కస్టమర్స్ లబోదిబోమంటున్నారు. ఆఫీస్ కు వెళ్లి అడిగితే కేసు పెడుతున్నారని కస్టమర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మై ఫ్రూట్ బాక్స్ వల్ల 1600 మందికి పైనే మోసపోయారని తెలుస్తోంది. మై ఫ్రూట్ బాక్స్ నడిపే వారిని కఠినంగా శిక్షించాలని కస్టమర్స్ అధికారులను వేడుకుంటున్నారు.

ALSO READ: Tatkal Ticket Booking Rules 2025 : తత్కాల్ టికెట్ రూల్స్ మారాయి.. బుకింగ్ చేసే సమయంలో ఇవి పాటించడం తప్పనిసరి

బోరబండ, శ్రీనగర్ కాలనీలో ఓ కస్టమర్ మోసపోయాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లల్లో చూసి తాము ఆర్డర్ పెట్టామని వాపోయాడు.  ఆర్డర్ పెట్టి వారం రోజులు అవుతుందని.. డబ్బులు చెల్లించే వరకు స్పందించారని.. చెల్లించాక వాళ్లు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ స్టాగ్రామ్ చూసి రూ.3000 డబ్బులు పే చేశానని మరో బాధితుడు వాపోయాడు. ఆ తర్వాత  డబ్బులే చెల్లించలేదని.. కనీసం అందుబాటులో లేరని బాధిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. వారికి వందల సార్లు ఫోన్ చేశామని అయినప్పటికీ స్పందించలేదని వాపోయారు.

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×