రివ్యూ : కాదలిక్క నేరమిళ్ళై మూవీ
నటీనటులు : రవి మోహన్ (జయంరవి), నిత్యా మీనన్, యోగిబాబు తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
డైరెక్టర్ : కృతింగ ఉదయనిధి
తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిళ్ళై’ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. నిత్యా మీనన్, జయం రవి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 20న తమిళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మరి ఈ రొమాంటిక్ మూవీని ఓటీటీలో మూవీ లవర్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంది? అనే విషయాన్ని రివ్యూలో చూద్దాం.
కథ
శ్రియ చెన్నైలో ఆర్కిటెక్చర్ గా పని చేస్తుంది. తను ప్రేమిస్తున్న కరణ్ ను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని ఆశపడుతుంది. కానీ కరణ్ తనను మోసం చేస్తున్నాడు అని తెలుసుకొని, అతనికి బ్రేకప్ చెప్తుంది. ఇక మరోవైపు సిద్ధార్థ్ స్ట్రక్చరల్ ఇంజనీర్ గా పని చేస్తాడు. అతడు నిరుపమను ప్రేమించగా, ఇద్దరి మధ్య పిల్లల విషయంలో గొడవలు రావడంతో బ్రేకప్ అవుతుంది. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ ఒత్తిడి కారణంగా సిద్ధార్థ స్పెర్మ్ ఫ్రీజింగ్ కి ఇస్తాడు. కానీ అక్కడ అడ్రస్ ని మాత్రం తప్పుగా రాస్తాడు. మరోవైపు బ్రేకప్ అయ్యాక డిసప్పాయింట్ అయిన హీరోయిన్ శ్రియ ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆధునిక ఆలోచనకి ఫ్యామిలీ అంగీకరించపోవడంతో తల్లిదండ్రులకు దూరమవుతుంది. తర్వాత ఓ పని మీద సిద్ధార్థ, శ్రీయ మధ్య పరిచయం పెరుగుతుంది.
కట్ చేస్తే ఎనిమిదేళ్ల తర్వాత శ్రియా మగపిల్లాడికి జన్మనిస్తుంది. ఆ తర్వాత ఆఫీసులో కలిసిన శ్రియ, సిద్ధార్థ ప్రేమలో పడతారు. కానీ సడన్ గా నిరుపమ రీఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత సిద్ధార్థ, శ్రీయ లైఫ్ లో ఏం జరిగింది? శ్రియ కొడుకుకి తండ్రి ఎవరు? సింగిల్ పేరెంట్ గా హీరోయిన్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? అనేది స్టోరీ.
విశ్లేషణ
తమిళ హీరో, నిర్మాత, మంత్రి ఉదయనిది స్టాలిన్ భార్య ఈ మూవీ డైరెక్టర్ కృతింగ ఉదయనిధి. ఈ సినిమా ద్వారా ఆమె తాను చెప్పాలనుకున్న అంశాన్ని క్లియర్ గా ప్రేక్షకులకు తెరపై చూపించింది. తను రాసుకున్న కథను అనుకున్న విధంగా ప్రేక్షకులకు చూపించడంలో ఏమాత్రం తడబడలేదు. మోడ్రన్ రిలేషన్, బంధాలపై యువతరం ఆధునిక ఆలోచనల చుట్టూ సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. అసలు ఐవిఎఫ్, స్పెర్మ్ ఫ్రీజింగ్ లాంటి విషయాలను బహిరంగంగా ఇంకా చర్చించడానికి ఆలోచిస్తున్నారు జనాలు. కానీ యంగ్ జనరేషన్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూడొచ్చు. అక్కడక్కడా సన్నివేశాలను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల పరిచయం, వాళ్ళ బ్రేకప్ సీన్లు డ్రాగ్ చేసినట్టు అన్పిస్తుంది. సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమా నడుస్తున్నంతసేపు ఫీల్ గుడ్ మూవీ అన్న ట్యాగ్ కు తగ్గట్టుగా హాయిగా సాగుతుంది సోల్ ఫుల్ మ్యూజిక్. పాటలు కూడా పర్లేదు. గావెమిక్ ఆరీ కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ షార్ప్ గా, క్లీన్ గా అనిపిస్తుంది. ఇక నటీనటులు తమ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్
మ్యూజిక్
ప్రీ క్లైమాక్స్
నటీనటులు
మైనస్ పాయింట్స్
సాగదీసినట్టుగా అనిపించే కొన్ని సీన్స్
జయం రవి లవ్ ట్రాక్
మొత్తంగా
ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ‘కాదలిక్క నేరమిళ్లై’.
రేటింగ్ : 2.5/5