BigTV English

Family Hospitalized After Eating Mandi: పెళ్లిరోజుమండి బిర్యానీ తిని ఆస్పత్రి పాలైన కుటుంబ సభ్యులు!

Family Hospitalized After Eating Mandi: పెళ్లిరోజుమండి బిర్యానీ తిని ఆస్పత్రి పాలైన కుటుంబ సభ్యులు!

Complete Family Hospitalized after Eating Mandi in Rangareddy: ఫంక్షన్, ఈవెంట్ ఏదైనా సరే.. బిర్యానీ చాలా కామన్ అయిపోయింది. పుట్టినరోజు, పెళ్లిరోజులకే కాదు.. ప్రమోషన్ వచ్చినా బిర్యానీనే.. క్రికెట్ లో ఫేవరెట్ టీమ్ గెలిచినా బిర్యానీనే. పరీక్షలు పాసైతే బిర్యానీ.. ఫెయిలైనా ఆ బాధలోనూ బిర్యానీనే తింటున్నారు. ప్రతిదానికి బిర్యానీనే తింటుండటానికి తోడు.. కుప్పలు తెప్పలుగా బిర్యానీ సెంటర్లు వెలిశాయి. నాణ్యత లేని ఆహారం, వ్యాపారంలో లాభమే ప్రధాన ధ్యేయంగా.. నిల్వ ఉంచిన, కుళ్లిన ఆహారాలను పెడుతుండటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఒక కుటుంబం మండి బిర్యానీ తిని అనారోగ్యం పాలైంది.


పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకునేందుకు ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ అందరూ మండి బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు. అంతా బానే ఉంది. కానీ కొద్దసేపటికే వారందరికీ వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. ఎలాగొలా ఆస్పత్రిలో చేరారు. అప్పరెడ్డిగూడా గ్రామం కావాలి నరేందర్ కుటుంబానికి ఎదురైన పరిస్థితి ఇది. మే 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

బుధవారం రాత్రి 9 గంటలకు నరేందర్ తన ఫ్యామితో కలిసి షాద్ నగర్ లో ఉన్న సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళ్లి.. ఎంచక్కా మండి బిర్యానీ తిన్నారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్తుండగా.. వరుసగా ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వెంటనే శంషాబాద్ లో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నరేందర్ కు రక్తపు వాంతులు, విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. నరేందర్ సహా 8 మంది.. భార్య మంగమ్మ, దీక్షిత, తన్విక, అనిరూద్, అభిలాష్, జోష్ణ, సాయి, శ్రీకర్ లు అస్వస్థతకు గురయ్యారు.


Also Read: KCR govt snooped on judges and lawyers: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక, జడ్జీలు, అడ్వకేట్ సహా..

వారందరికీ చికిత్స చేసిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిపారు. నాణ్యత లేని ఆహారం తిన్నందునే అస్వస్థతకు గురైనట్లు నిర్థారించారు. బయట రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆహారం తినే ముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. చవక ధరకే వస్తుంది కదా అని ఎక్కడపడితే అక్కడ ఆహారం తింటే.. ఇలా ఆస్పత్రి పాలై లక్షలకు లక్షల రూపాయలు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×