BigTV English

Australia Vs Namibia Highlights: నమీబియాకి చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 5.4 ఓవర్లలో విజయం!

Australia Vs Namibia Highlights: నమీబియాకి చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 5.4 ఓవర్లలో విజయం!

Australia Won by 9 Wickets on Namibia in ICC Men’s T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో ఇన్నాళ్లు తక్కువ స్కోర్లే నమోదు కావడం చూశాం. కానీ టార్గెట్ ను 5.4 ఓవర్లలో చేధించి ఆస్ట్రేలియా తాజా సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా మధ్య వెస్టిండీస్ లో జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ముగించి.. టీ 20 ప్రపంచకప్ లో రికార్డులను బద్దలు కొట్టింది.


వివరాల్లోకి వెళితే… 73 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ధనాధన్ ఆడారు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ 8 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34 పరుగులు, కెప్టెన్ మార్ష్ 9 బంతుల్లో 18 పరుగులు చేసి, మ్యాచ్ ని 5.4 ఓవర్లలో ఘనంగా ముగించారు.

నమీబియా బౌలింగులో డేవిడ్ వైజ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన నమీబియాకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మైఖేల్ వాన్ (10), నికో డేవిన్ (2) చేసి అవుట్ అయ్యారు. తర్వాత కెప్టెన్ గెర్తర్డ్ ఎరాస్మస్ (36) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. తర్వాత ఒకొక్క పరుగు చొప్పున ముగ్గురు చేశారు. తర్వాత 2 పరుగులు ఒకరు, 3 పరుగులు ఒకరు చేశారు. రుబెన్ మాత్రం 7 పరుగులు చేశాడు. మొత్తానికి నమీబియా లైనప్ ఆస్ట్రేలియా బౌలింగు ముందు తునాతునకలైపోయింది. చివరికి 17 ఓవర్లలో 72 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.


ఆస్ట్రేలియా బౌలింగులో జోష్ హేజిల్ వుడ్ 2, మార్కస్ స్టోనిస్ 2, పాట్ కమిన్స్ 1, అడమ్ జంపా 4, నాథన్ ఎలిస్ 1 వికెట్ పడగొట్టారు.

 

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×