BigTV English

Shubman Gill : కోహ్లీ బాటలో.. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా గిల్..

Shubman Gill  :  కోహ్లీ బాటలో..  ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా గిల్..
ICC ODI Rankings


Shubman Gill : భారత క్రికెట్ అన్నిచోట్లా దూసుకుపోతోంది. రికార్డుల మీద రికార్డులను షేక్ చేస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్ మన్ గిల్ నెంబర్ 1 స్థానాన్ని పొందాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ ల్లో ఇండియా అప్రతిహితంగా సాగిపోతోంది. ఇండియన్ బ్యాటర్లు దుమ్ము దులుపుతున్నారు. దీంతో టాప్ టెన్ లోకి విరాట్ కోహ్లీ (4), రోహిత్ శర్మ (6) వచ్చి చేరారు.

మొన్నటి వరకు నెంబర్ -2గా ఉన్న గిల్, అనూహ్యంగా నెంబర్ 1కి వచ్చాడు. ఇంతవరకు నెంబర్ వన్ గా ఉన్న బాబర్ ఆజామ్ వరల్డ్ కప్ లో ఫెయిల్ అవడంతో అతను ఆ స్థానాన్ని కోల్పోయాడు. దీంతో కేవలం 6 పాయింట్ల దూరంలోనే ఉన్న శుభ్ మన్ గిల్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.


శుభ్ మన్ గిల్ అయితే జ్వరంతో రెండు మ్యాచ్ లకు అందుబాటులోకి రాలేదు. తర్వాత నుంచి జరిగిన ఆరు మ్యాచుల్లో 219 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో గిల్ 95 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్ లో 55 పరుగులతో ఒక ఆఫ్ సెంచరీ చేశాడు. అలాగే వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తిచేసిన బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. 38 మ్యాచ్ ల్లో ఈ ఫీట్ పూర్తి చేసిన తొలిబ్యాటర్ గా రికార్డులకెక్కాడు.

అయితే విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు, మూడు ఆఫ్ సెంచరీలతో 543 పరుగులతో వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో వన్డే ర్యాంకింగ్ లో ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ అయితే ఒక సెంచరీ చేసి రెండు హాఫ్ సెంచరీలు చేసి 442 పరుగులతో ఉన్నాడు.

ఒకరకంగా చెప్పాలంటే సచిన్ తర్వాత కోహ్లీ వచ్చాడు. ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇప్పుడు కోహ్లీ తర్వాత ఎవరన్నది ప్రశ్నార్థకంగా ఉంది. దానిని శుభ్ మన్ గిల్ పూర్తి చేస్తాడని, కోహ్లీ వారసుడు గిల్ అని అందరూ అనేమాట. మరి గిల్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడనేది వేచి చూడాల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×