Gold price : బంగారం ధరలు త్వరలో ఆకాశాన్ని తాకనున్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో పది గ్రాములు పుత్తడి ధర రూ.63000 వరకు చేరే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. ధర భారీగా పెరగడానికి పండుగ సందర్భంతో పాటు మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

అమెరికా ప్రభుత్వం తాజాగా వడ్డీ రెట్లను పెంచింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికే వడ్డి రేట్లను పెంచినా.. దాని ప్రభావం బంగారం ధరలపైన విపరీతంగా పడుతుంది. ప్రపంచంలో ఇప్పుడు రెండు భీకర యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచలోని చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఎందుకంటే బంగారంలో పెట్టుబడులు ఎప్పటికీ సురక్షితం.
భారతదేశంలో ప్రజలు బంగారం కొనడానికి ఎప్పుడూ మక్కువ చూపుతారు. కానీ దేశంలోని గ్రామాలలో ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో కరువు, వరదలు వంటి సమస్యల కారణంగా గ్రామ ప్రజలు బంగారం ఎక్కువగా కొనకపోవచ్చు.
వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక వ్యవస్థలలో సమస్యలు, కరోనా వంటి కారణాలతో చాలామంది ఇప్పటికీ బంగారంలోనే పెట్టుబడులను పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అయితే బంగారం ధరలు రూ.63000 స్థాయికి చేరినా అది తాత్కాలిమేనని, దీనివల్ల స్టాక్ మార్కెట్‌పై తప్పనిసరిగా ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణుల అభిప్రాయపడుతున్నారు.