BigTV English

ICC ODI Rankings : వన్డే ర్యాంకింగ్స్ లో.. టీమ్ ఇండియా అదుర్స్!

ICC ODI Rankings : వన్డే ర్యాంకింగ్స్ లో.. టీమ్ ఇండియా అదుర్స్!
 ICC ODI Rankings

ICC ODI Rankings : వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచుంటే, దాని లెక్కే వేరుగా ఉండేది. ఈపాటికి టీమ్ ఇండియాకి, ఇటువంటి అవార్డులు వచ్చేసరికి, భూమి-ఆకాశం బద్ధలైపోయేవి. కానీ ఇప్పుడు.. ఓకే మంచిదేగా అంటున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌ ప్రకటించింది.


ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్లు టాప్ ఫైవ్ లో ముగ్గురున్నారు.  ప్రపంచకప్ లో  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ దుమ్మురేపారు. దీంతో బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో నిలిచారు.

826 రేటింగ్ పాయింట్స్‌తో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా.. 791 పాయింట్లతో విరాట్ కోహ్లీ మూడో స్థానం, 769 రేటింగ్ పాయింట్స్‌తో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.


అయితే ఆల్ రౌండర్ల జాబితా రవీంద్ర జడేజా ఒక్కడే టాప్ 10లో నిలిచాడు. బ్యాటింగ్ లో గిల్ నెంబర్ వన్ గా ఉన్నాడు. బౌలింగ్ కి వచ్చేసరికి సిరాజ్ ప్లేస్ జారిపోయింది. మూడో స్థానానికి పడిపోయాడు. జస్‌ప్రీత్ బుమ్రా నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. కుల్దీప్ యాదవ్ ఏడు, మహమ్మద్ షమీ 10వ ర్యాంక్ అందుకున్నారు.

అన్నింటా అద్భుతంగా మనాళ్లు ఆడారు. అన్నిచోటా తడబడిన ఆస్ట్రేలియా ఆడాల్సిన ఒక్క మ్యాచ్ లో ఫ్రొఫెషనల్ గా ఆడింది. రెండు వారికి అదృష్టం కూడా టాస్ రూపంలో కలిసి వచ్చింది. ఒకవేళ రోహిత్ టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకునేవాడేమో తెలీదు.

ఎందుకుంటే క్యూరేటర్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్లకి పిచ్ అనుకూలిస్తుంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్లకి కష్టం అన్నట్టు మాట్లాడారు. దీనివల్ల రోహిత్ అదే మాట నమ్మి ఉండవచ్చు.

బహుశా ఇదే భావంతో బ్యాటింగ్ పిచ్ కదాని, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా టీమ్ ఇండియా వచ్చినట్టుంది. ఎందుకంటే అందరూ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అలవోకగా ఆడుతారని అనుకున్నారు. కానీ పిచ్ రివర్స్ అయ్యేసరికి, అర్థం కాక శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అవుట్ అయిపోయారు. ముందే ఆ రాంగ్ డైరక్షన్ లో వెళ్లి ఉండకపోతే జాగ్రత్తగానే ఆడేవారు.

ఎందుకంటే వరల్డ్ కప్ లో ఆడిన 10 మ్యాచ్ ల్లో 5 ఛేజింగ్ ఆడారు. 5 ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అన్నీ విజయం సాధించారు. అక్కడ పిచ్ రిపోర్ట్ ప్రకారం పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నడిచింది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ తేడా రావడం ఇండియా పాలిట శాపంగా మారింది.

Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×