BigTV English

Niagara Car Blast : నయాగారా జలపాతానికి సమీపంలో పేలుడు.. అమెరికా-కెనడా సరిహద్దులు మూసివేత..

Niagara Car Blast : నయాగారా జలపాతానికి సమీపంలో పేలుడు.. అమెరికా-కెనడా సరిహద్దులు మూసివేత..

Niagara Car Blast : అమెరికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన నయాగారా జలపాతానికి సమీపంలో పేలుడు జరిగింది. రెయిన్ బో బ్రిడ్జ్ సరిహద్దు క్రాసింగ్ దగ్గర ఓ కారు పేలిపోయింది. ఈ పేలుడు దాటికి.. కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందారు. అమెరికా-కెనడా బార్డర్‌ చెక్‌ పాయింట్‌కు సమీపంలో ఈ పేలుడు జరగడంతో వెంటనే సరిహద్దులను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం నయాగారా జలపాతానికి వచ్చే పర్యాటకులపై కూడా ఆంక్షలు విధించారు.


వెంటనే రంగంలోకి దిగిన FBI అధికారులు.. ఉగ్రవాద దాడి కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి ఉగ్రకోణాలు కనిపించలేదని చెబుతున్నారు. కారులో అనుకోకుండా మంటలు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.

అతివేగంతో వెళ్తున్న కారు.. బలమైన వస్తువును ఢీ కొట్టడం వల్ల కారు గాలిలోకి ఎగిరినట్లు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఆ కారు తిరిగి నేలపై పడిన తర్వాత పేలిపోయిందని అంటున్నారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరా తీసినట్టు వైట్‌ హౌస్‌ తెలిపింది. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అంటూ వ్యాఖ్యలు చేశారు.


Tags

Related News

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Big Stories

×