BigTV English

ICC Player Of The Month Award : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో.. షమీ

ICC Player Of The Month Award : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేస్ లో.. షమీ
latest sports news telugu

ICC Player Of The Month Award(Latest sports news telugu):

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ముగ్గురు నామినేట్ అయ్యారు. వారిలో మన టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియా నుంచి మ్యాక్స్ వెల్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. క్రికెట్ ఆడుతున్న వివిధ దేశాల క్రికెటర్లు ఆ నెలలో చేసిన బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఆధారంగా ఈ అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ నెలకు గానూ వీరు ముగ్గురు నామినేట్ అయ్యారు.


ఇదే నెల 19న ఆస్ట్రేలియా-టీమ్ ఇండియా మధ్య ఫైనల్ జరిగింది. అంతవరకు ఆ 19 రోజుల్లో మహ్మద్ షమీ 15 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, మ్యాక్స్ వెట్ ఇండియాతో జరిగిన టీ 20 మ్యాచ్ లు ఆడారు. అందులో మ్యాక్స్ సెంచరీ కూడా చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్ లో ట్రావిస్ హెడ్ సెంచరీ చేశాడు. అందుకని వీరిద్దరూ, ఇండియా నుంచి మహ్మద్ షమీని నామినేట్ చేశారు.

ఇప్పుడు ఈ ముగ్గురిపై ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటు వేసేవాళ్లు…ఐసీసీ అకాడమీలోని ప్రముఖ జర్నలిస్టులు ఉంటారు, బ్రాడ్ కాస్టర్లు, ఇంకా మాజీ ఆటగాళ్లు, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యులు  వివిధ వర్గాల వారంతా ఉంటారు. చివరిగా ఐసీసీలో రిజిస్టర్ చేసుకున్న అభిమానులు కూడా పాల్గొంటారు. ఓటింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ని బట్టి ఎవరు విజేత అయ్యారో, ప్రతినెలా రెండో సోమవారం వారి పేరు ప్రకటిస్తారు.


మహిళల జట్టులో కూడా ముగ్గురు నామినేట్ అయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచి నహిదా అక్తర్, పర్ఘానా హోక్‌లు  రేసులో ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన సాదియా ఇక్బాల్ సైతం ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉంది.

ఆ నెలలో జట్ల మధ్య అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగి ఉండాలి. వాటిలో వీరి పెర్ ఫార్మెన్ బాగుండాలి. ప్రస్తుతం ఇండియాలో ఆస్ట్రేలియాతో వుమెన్స్ టీ 20 సిరీస్ జరుగుతోంది. ఇది డిసెంబర్ నెల కోటాలోకి వెళుతుంది. అప్పుడు మన అమ్మాయిలు బాగా పెర్ ఫార్మెన్స్ చేస్తే వీరూ నామినేట్ అయ్యే అవకాశాలున్నాయి.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×