S Sreesanth on Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ( Gautam Gambhir ) ఉద్దేశించి మరోసారి మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ (S Sreesanth) హాట్ కామెంట్స్ చేశారు. తనను మ్యాచ్ ఫిక్సర్, దేశద్రోహి అంటూ మైదానంలోనే అన్నాడని గౌతమ్ గంభీర్ పై ఫైరయ్యారు. మైదానంలోని తనను బూతులు తిట్టిన గౌతమ్ గంభీర్ ను అస్సలు వదిలేది లేదంటూ హెచ్చరించారు. ఏ రోజుకైనా, గౌతమ్ గంభీర్ చెంప చెల్లుమనేలా చేస్తానని మార్నింగ్ ఇచ్చారు. అప్పటి వరకు తాను నిద్రపోనని షాపింగ్ కామెంట్స్ చేశారు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. ఈ క్రమంలో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మధ్య వివాదం పాము, ముంగిస మధ్య ఉన్న పగలాగానే క్రమ క్రమంగా పెరుగుతోంది. గతంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఓ మ్యాచ్ జరుగుతుండగా శ్రీశాంత్ దగ్గరకు వచ్చి గౌతమ్ గంభీర్ రెచ్చగొట్టాడు. అతడు ఏకాగ్రత దెబ్బతీసేందుకు.. 2013 ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చాడు గౌతమ్ గంభీర్. నువ్వు ఆఫ్ట్రాల్ మ్యాచ్ ఫిక్సర్, దేశద్రోహివి అంటూ బూతులు తిట్టాడు. నీలాంటోడితో క్రికెట్ ఆడడం అంటేనే అసహ్యంగా ఉందని శ్రీశాంత్ ను ఉద్దేశించి, గౌతమ్ గంభీర్ రెచ్చిపోయాడు.
ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ను ఉద్దేశించి శ్రీశాంత్ కూడా సీరియస్ అయ్యాడు. అయితే తోటి టీం ఇండియా ప్లేయర్ కావడంతో.. సాఫ్టుగానే ఈ సంఘటనను డీల్ చేశాడు శ్రీశాంత్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు గౌతీ భాయ్ ? కొంచెమైనా బుద్ధుందా? నన్నే మ్యాచ్ ఫిక్సర్ అంటావా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు శ్రీశాంత్. కడుపుకు అన్నం తింటున్నావా? లేక గడ్డి తింటున్నావా ? అని కడిగి పారేశారు. దీంతో ఇద్దరు మధ్య పెద్ద గొడవే చోటు చేసుకుంది. అయితే ఈ గొడవలు చాలా రోజుల తర్వాత మళ్లీ శ్రీశాంత్ తెరపైకి తీసుకువచ్చారు. తనను మైదానంలో అవమానించిన గౌతమ్ గంభీర్ ను వదిలేది లేదంటూ హెచ్చరించారు. ఏ రోజుకైనా అతడి చెంప చెల్లుమనిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
టీమిండియా హెడ్ కోచ్ గా కూడా గౌతం గంభీర్ పనికిరాని మండిపడ్డారు శ్రీశాంత్. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే ఈ అహంకారిని తప్పించాలని డిమాండ్ చేశారు. గంభీర్ స్థానంలో మహేంద్రుడికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.