E-Paper
Advertisement

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు
Advertisement

Saeed Ajmal questions Sachin Tendulkar LBW : టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan
) మధ్య జరిగే మ్యాచ్ లు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతాయి. రెండు జట్ల మధ్య మ్యాచులు జరిగాయి అంటే… యుద్ధ వాతావరణమే నెలకొంటుంది. పాకిస్తాన్ గెలవాలని అక్కడి అభిమానులు.. ఇండియా గెలవాలని ఇక్కడ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ టోర్నమెంట్స్ లలో టీమిండియా పై చేయి సాధించింది. ఇప్పటికీ పాకిస్తాన్ ను అడుగడుగునా ఓడిస్తూ ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ( Saeed Ajmal ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి టోర్నమెంట్ లో టీమిండియాకు అనుకూలంగా అంపైర్లు వ్యవహరిస్తున్నారని బాంబు పేల్చారు. 2011లో సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar LBW) LBW అయినప్పటికీ.. ఇవ్వకుండా థర్డ్ అంపైర్ కుట్రలకు తెర లేపాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ప్రతిసారి టీమిండియాను అంపైర్లు కాపాడుతున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతూ వస్తోందని.. ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయని కామెంట్ చేశారు.

అసలు సచిన్ LBW వివాదం ఏంటి ?

Advertisement

2011 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ధోని సారథ్యంలోని టీమిండియా ఈ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా కూడా నిలిచింది. అయితే 2011 వన్డే వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్స్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో చివరివరకు పోరాడిన టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్స్ బరిలో నిలబడింది. అయితే ఇందులో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయగా, సచిన్ టెండూల్కర్ ను (Sachin Tendulkar ) 20 పరుగుల వద్ద అవుట్ చేసే ఛాన్స్ వచ్చింది.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Advertisement

సయీద్ అజ్మల్ ( Saeed Ajmal) వేసిన ఓ బంతిని ఆడే క్రమంలో వికెట్ల ముందు సచిన్ టెండూల్కర్ దొరికిపోయాడు. అయితే అప్పటి ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ వెంటనే అవుట్ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో వికెట్లను బంతి తగలనట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ సచిన్ ను నాటౌట్ గా ప్రకటించారు. ఈ క్రమంలో లైఫ్ వచ్చిన సచిన్ టెండూల్కర్ అద్భుతంగా రాణించి 85 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా గెలిచింది.

థర్డ్ అంపైర్ అమ్ముడుపోయాడు.. అందుకే సచిన్ బయటపడ్డాడు

సచిన్ టెండూల్కర్ LBW పై సయీద్ అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 23 పరుగుల వద్ద సచిన్ టెండూల్కర్ అవుట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్ మ్యాజిక్ చేశాడని మండిపడ్డారు. హ్యాక్ ఐ బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో బంతి లెగ్ స్టంప్ ను దాటి వెళుతున్నట్లు కావాలని చూపించారని ఆరోపణలు చేశారు. రెండు ఫ్రేమ్లను కట్ చేసి… బంతి తగలకుండా చూపించారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సచిన్ నాటౌట్ గా బయటపడ్డాడని సయీద్ అజ్మల్ ఆరోపణలు చేశారు. దీంతో టీం ఇండియా గెలిచిందని… లేకపోతే 2011 లో పాకిస్తాన్ ఛాంపియన్ గా నిలిచేదని వ్యాఖ్యానించారు.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

ధోని కెప్టెన్సీలో ఆడటమే కొంప ముంచింది..ఆ దుర్మార్గుడు నన్ను తొక్కేసాడు!

భారతి ఫుల్మాలికి ఘోర అవమానం…అమ్మాయి కాదు మగాడు అంటూ!

పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే, టీమిండియా ఓడిపోతుందని… శ్రీలంక గెలిచేలా ఫిక్సింగ్ చేశారు!

ఒరేయ్ ఆలూ అంటూ ట్రోల్స్‌…టీమిండియా అభిమానిపై ఇంజ‌మామ్ దాడి!

అస‌లు మీకు బుర్ర ఉందా..ముస‌లోడు అయ్యాక షమీని తీసుకుంటారా ?

Big Stories

Advertisement
×