BigTV English

Team India : టీమ్ ఇండియాకు కెప్టెన్సీ గండం..!

Team India : టీమ్ ఇండియాకు కెప్టెన్సీ గండం..!

Team India : వన్డే వరల్డ్ కప్ 2023 లో టీమ్ ఇండియా కథ చివరికి విషాదంతో ముగిసింది. కప్ టీమ్ ఇండియాదేనని నమ్మిన అందరూ కూడా రోహిత్ కెప్టెన్సీపై పెద్ద శంకలు పెట్టుకోలేదు. ఆడినంత కాలం తనే కెప్టెన్ అనుకున్నారు. కానీ ఫైనల్ లో కథ అడ్డం తిరిగింది. దీంతో కెప్టెన్సీపై కూడా రోహిత్ పెద్ద ఆసక్తి చూపించడం లేదని సమాచారం.


అయితే ఇప్పటికిప్పుడు ఆ అవసరం రాకపోవచ్చు. కానీ ఇప్పుడే టీ 20 దగ్గరే సమస్య మొదలైంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఉండి ఉంటే, ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. ఒకవేళ రోహిత్ కెప్టెన్సీ వద్దని అనుకుంటే, కళ్లు మూసుకుని హార్దిక్ కి ఇచ్చేసేవారు.

మొదట్లో తనది చిన్న దెబ్బే అన్నారు గానీ, అది ఆపరేషన్ వరకు వెళ్లింది. సంవత్సరం వరకు రెస్ట్ అని కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తను తిరిగొచ్చి, మళ్లీ ఫిట్ నెస్ ప్రూవ్ చేసుకుని పట్టాలెక్కే సరికి కొంత సమయం పట్టేలా ఉంది. ఈ మధ్యలో పరిస్థితేమిటి? అనే ప్రశ్న వచ్చింది.


హార్దిక్ వచ్చేవరకు రోహిత్ కెప్టెన్సీలో ఉంటే సమస్య లేదు. కాదన్నా, లేదా బీసీసీఐ ప్రత్యామ్నాయం కోసం వెతకాలన్నా ఇప్పుడు టీమ్ ఇండియాలో కెప్టెన్ అయ్యే వారు కనిపించడం లేదు. ఆ ఆప్షన్ ఎవరున్నారని వెతుకుతున్నారు. టీ 20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కొహ్లీ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

దీంతో వన్డేల నుంచి కొహ్లీని బీసీసీఐ తప్పించింది. వళ్లు మండిన కొహ్లీ,  టెస్ట్ కెప్టెన్సీ నుంచి తనే తప్పుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే, అప్పుడు కొహ్లీ కెప్టెన్సీ విషయంలో పెద్ద దుమారమే రేగింది.

ఆ సమయానికి బీసీసీఐకి రోహిత్ శర్మ…బంగారు కోడిపెట్టలా దొరికాడు. అప్పుడక్కడ సౌరభ్ గంగూలీ ఉన్నాడు. పిల్లి మెడలో గంట కట్టినట్టు, రోహిత్ మెడలో కెప్టెన్సీ తాడు వేసేశారు. తనింతవరకు అటు కెప్టెన్ గా, ఇటు బ్యాటర్ గా సమర్థవంతంగానే నడిపించాడు. కానీ తర్వాతే ఎవరనేది ప్రశ్నగా ఉంది.

ఒకసారి జట్టువైపు చూస్తే శుభ్ మన్ గిల్, శ్రేయాస్, సిరాజ్ వీరంతా యువతరం. కేఎల్ రాహుల్ ఫామ్ లో వచ్చీ వెళుతున్నాడు. లేకపోతే తను మంచి ఆప్షన్ అయ్యవాడే. కెప్టెన్సీ అప్పజెబితే బ్యాటర్ గా ఫెయిల్ అవుతాడని భావించి ఆగిపోతున్నారు.

రవీంద్ర జడేజాలో కుర్రతనం పోలేదు. టీమ్ తన మాట వింటారా? అంటే డౌటే..ఎందుకంటే తనని ఫ్రెండ్లీగానే చూస్తుంటారు. అదీ సమస్య. బూమ్రా ఉన్నాడు. తనకి ఇవ్వవచ్చు, కాకపోతే ఫిట్ నెస్ సమస్యలున్నాయి.

ఇక చివరికి మహ్మద్ షమీ మిగిలాడు. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభ చూపిన షమీకిస్తే, ఆనాటి కపిల్ దేవ్ లా మళ్లీ సంచలనాలు సృష్టిస్తాడేమో చూడాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×