BigTV English

Rohit Sharma: ముంబై ఇండియన్స్ నుంచి.. రోహిత్ అవుట్?

Rohit Sharma: ముంబై ఇండియన్స్ నుంచి.. రోహిత్ అవుట్?

Rohit Sharma Likely to leave Mumbai Indians before IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలానికి ముందు పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ బయటకు వస్తాడా? లేక ఫ్రాంచైజీ వదులుకుంటుందా? అనే విషయంపై నెట్టింట మళ్లీ జోరుగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ముంబై ఇండియన్స్ తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్టేనని తెలిపాడు. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెట్టింట మళ్లీ చర్చ రయ్ మని లేచింది.  గతంలో రోహిత్ శర్మకు రూ.50 కోట్లు అంశంపై ఏకంగా లక్నో ఫ్రాంచైజీ ఓనర్ మాట్లాడటం చర్చనీయాంశమైంది.

అయితే ఆకాశ్ చోప్రా ఇంకా ఏం చెప్పాడంటే..  ముంబై ఇండియన్స్‌తో కొనసాగడం రోహిత్ శర్మకు ఇష్టం లేదని తెలిపాడు. అయితే తను జట్టులో ఉంటాడా? ఉండడా? అనేది తన పర్సనల్. కాకపోతే నా లెక్క ప్రకారం ఉండకపోవచ్చునని అన్నాడు. ఎందుకంటే అందుకు బలమైన కారణం ఉందని అన్నాడు.


రోహిత్ శర్మకు ఇప్పుడు వయసు 37 సంవత్సరాలు. ఒకవేళ ముంబై తీసుకుంటే ఇంకో మూడేళ్లు కదపకూడదు. అంటే అప్పటికి 40 ఏళ్లు వచ్చేస్తాయి. అందువల్ల టీ 20 మ్యాచ్ లకి కెప్టెన్ గా సూట్ కాడని అన్నాడు. అందువల్లనే తీసుకోరని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఈ లాజిక్ సరైనదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read: 2023 వన్డే వరల్డ్ కప్.. భారత్ ఆదాయం ఎంతో తెలుసా?

మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం ఇది వర్తించదని అన్నాడు. సీఎస్‌కే తో తనకున్న అనుబంధం వేరేనని అన్నాడు. అది వేరే లెక్క, వేరే కథలున్నాయని అన్నాడు. అందువల్ల ముంబై నుంచి రోహిత్ తనంతట తానే వెళ్లిపోవచ్చునని అన్నాడు.

తను ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గా ఉండి, ఐపీఎల్ లాంటి లీగ్ లో ఏ జట్టుకి కెప్టెన్ గా లేకపోవడమంత అవమానం మరొకటి లేదని కూడా అన్నాడు. తను వెళతాడని తెలుసు కాబట్టి, ముందే ఫ్రాంచైజీ వదిలేసినా ఆశ్చర్య పోనవసరం లేదని అన్నాడు. అంటే నా దగ్గరేదో సమాచారం ఉందని అనుకోవద్దు. అలాంటిదేమీ లేదు, అందరిలాగే నేనూ ఊహించి, నా నాలెడ్జ్ తో చెబుతున్నానని అన్నాడు.

అయితే వేలంలో రోహిత్‌ను ఇతర జట్లు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ అందరూ అనుకుంటున్నట్టు రూ.50 కోట్లు రాదుగానీ, బంపారఫర్ అయితే వస్తుందని  ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేసుకున్న దగ్గర నుంచి జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవేనని అన్నాడు.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×