Shubman Gill : మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోని నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే దాని ఫలితం మాత్రం పూర్తిగా భారత జట్టుకు అనుకూలంగా మారిందనే చెప్పవచ్చు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చారిత్రాత్మక భాగస్వామ్యం, కెప్టెన్ గిల్ కెప్టెన్సీ ఇంగ్లాండ్ జట్టు వ్యూహాలను తలకిందులు చేసాయి. ఈ మ్యాచ్ భారత క్రికెట్ పోరాట పటిమకు ప్రతీకగా నిలిచింది. నాలుగో రోజు ఆట ప్రారంభంలో భారత్ 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్ విజయం ఖాయమని భావించారు. కానీ మొదట శుభ్‌మన్ గిల్ 103 పరుగులు, కేఎల్ రాహుల్ 90 పరుగులు చేసి మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా నాటౌట్ 107 పరుగులు, వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 101 పరుగులు చేసి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఐదో వికెట్‌కు 303 బంతుల్లో 203 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను ఓటమి నుంచి కాపాడటమే కాకుండా ఇంగ్లాండ్‌ను పూర్తిగా అలసిపోయేలా చేశారు.
Also Read : WCL 2025 : మొన్న 41, ఇవాళ 39 బంతుల్లో.. వరస సెంచరీలతో రికార్డు..!
వారి బ్యాటింగ్ పై గిల్ ప్రశంసలు
ముఖ్యంగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారని భారత జట్టు కెప్టెన్ గిల్ కొనియాడారు. వాళ్లు ఇద్దరూ 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రా వెళ్దామంటే ఎందుకు ఒప్పుకోవాలి..? అలాంటి సమయంలో అస్సలు ఎందుకు ఆటను ఆపుతామని వాళ్లు సెంచరీలు చేసేందుకు పూర్తి అర్హులు. ఈ సిరీస్ లో అభిమానులు టెస్ట్ క్రికెట్ మజాను ఆస్వాదిస్తున్నారు. చివరి టెస్ట్ లో విజయం సాధించి.. సిరీస్ డ్రాగా ముగిస్తామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు. ఐదో రోజు ఇంగ్లాండ్ గెలుపు అవకాశాలు తగ్గిపోతుండటంతో కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక ఎత్తుగడ వేశాడు. మ్యాచ్ ను త్వరగా ముగించడానికి ప్రయత్నించాడు. స్టోక్స్ రవీంద్ర జడేజాతో షేక్ హ్యాండ్ ఇచ్చి మ్యాచ్ ను డ్రా గా ముగించడానికి ప్రయత్నించాడు.
నవ్వుతూ కనిపించిన కెప్టెన్ గిల్..
జడేజా అతనికీ ధీటైనా జవాబు ఇస్తూ.. ఈ నిర్ణయం తన చేతుల్లో లేదని అటు కొనిసాగిస్తానని చెప్పాడు. ఈ సమయంలో కెమెరా భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లినప్పుడు కెప్టెన్ గిల్ పెద్దగా నవ్వుతూ కనిపించాడు. అతని నవ్వు జట్టు స్థితినే కాకుండా ఇంగ్లీషు శిబిరంలోని నిరాశ పై ఒక గట్టి వ్యంగ్యాస్త్రంలా మారింది. ఇక గిల్ ఈ రియాక్షన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు ఒక కొత్త చరిత్ర సృష్టించారు. టెస్ట్ క్రికెట్ 91 ఏళ్ల చరిత్రలో ఒకే సిరీస్‌లో నలుగురు భారత బ్యాట్స్‌మెన్‌లు 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. శుభ్‌మన్ గిల్ – 722 పరుగులు, కేఎల్ రాహుల్ 511 పరుగులు, రిషబ్ పంత్ 479, రవీంద్ర జడేజా 454 పరుగులు చేశాడు.