BigTV English

Woman in Train: రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ.. లేడీ కానిస్టేబుల్ ఎంట్రీతో ఫ్యూజులు ఔట్.. ఏమైంది?

Woman in Train: రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ.. లేడీ కానిస్టేబుల్ ఎంట్రీతో ఫ్యూజులు ఔట్.. ఏమైంది?

ఓ మహిళ ఒంటరిగా రైలు ఎక్కింది. ఆమెతో మరెవ్వరు లేరు. అలాగే ఆ బోగీలో కూడా అంత పురుషులే ఉన్నారు. ఆమె మాత్రమే మహిళ. దీంతో ఆమెలో అనుకోకుండానే ఏదో భయం మొదలైంది. అంతా మంచోళ్లయితే పర్వాలేదు.. వీళ్లలో ఎవరైనా చెడ్డవాడు ఉంటే? నిద్రపోయినప్పుడు ఏమైనా చేస్తే? ఆమె బుర్ర నిండా అవే ఆలోచనలు. ఇంత భయంతో ఇక నిద్రేమి పడుతుంది. ఈ రాత్రి జాగారమే అనుకుంది. సరిగ్గా అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ ఆ బోగీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘‘నీ పేరు పూర్వినా’’ అని అడిగింది. అంతే.. దెబ్బకు ఆ మహిళా ప్రయాణికులురాలి ఫ్యూజులు ఔట్.


ఎవరు ఆ మహిళ? ఆ కానిస్టేబుల్‌కు ఆమె పేరు ఎలా తెలుసు?

ఆ లేడి కానిస్టేబుల్ తన పేరు ఆడగగానే పూర్వి నోటి నుంచి మాట రాలేదు. సందేహంగానే.. ‘ఆ.. ఔను నా పేరే పూర్వి’ అని చెప్పింది. ఆ వెంటనే లేడి కానిస్టేబుల్.. నెంబర్ 38 మీ బెర్తే కదా? అని మరో ప్రశ్న అడిగింది. దీంతో పూర్వి ఔనని సమాధానం చెబుతూనే.. ఇంతకీ నేను మీకు ఎలా తెలుసు అని అడిగింది. దానికి ఆ లేడీ కానిస్టేబుల్ చెప్పిన సమాధానం విని మరోసారి ఆశ్చర్యపోయింది పూర్వి.


మహిళ భద్రత కోసమే..

పూర్వి అడిగిన ప్రశ్నకు లేడీ కానిస్టేబుల్ సమాధానం ఇస్తూ.. ‘‘ఈ బోగీలో మీరు ఒక్కరే మహిళ ప్రయాణికురాలని తెలిసింది. అందుకే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందేమోనని చెక్ చెయ్యడానికి వచ్చాం’’ అని తెలిపింది. ఆ తర్వాత ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చి.. మీకు ఏదైనా సమస్య వచ్చినా.. సేఫ్‌గా లేనని అనిపించినా వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చెయ్యండి వస్తామని చెప్పింది. దీంతో పూర్వి చాలా సర్‌ప్రైజ్ అయ్యింది. రైల్వే మహిళలకు ఈ స్థాయిలో భద్రత కల్పిస్తుందా అని మరోసారి ఆశ్చర్యపోయింది. జర్నీ తర్వాత ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో లేడి కానిస్టేబుల్ వచ్చి.. తాను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉన్నానో లేదో చెక్ చేసి మరీ వెళ్లారని పేర్కొంది.

మహిళల భద్రత కోసమే..

రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఈ చర్యలు చేపడుతోంది. టీటీల నుంచి సమాచారాన్ని సేకరించి మరీ బోగీల్లో ఒంటరిగా ఉండే మహిళలకు భద్రత కల్పిస్తోంది. ముఖ్యంగా ఓవర్ నైట్ జర్నీ రైళ్లలో ఆర్పీఎఫ్ ప్రత్యేకంగా లేడీ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేసి.. మహిళా ప్రయాణికుల్లో అభద్రతా భావాన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది. పూర్వి చేసిన సోషల్ మీడియా పోస్టుపై మరికొందరు స్పందిస్తూ.. తమను కూడా కొంతమంది ఆర్పీఎఫ్ పోలీసులు కలిశారని, ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ లైన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని చెప్పారని పేర్కొన్నారు. మరి మీకూ ఇలాంటి అనుభవం ఎదురైందా?

ఇది కూడా చదవండి: IRCTC సూపర్ ఆఫర్.. తిరుపతి నుండి షిర్డీ యాత్రకు గోల్డెన్ ఛాన్స్!

Related News

IRCTC Tour Package: మ్యాజిక్ మేఘాలయా టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజ్, అస్సలు మిస్ అవ్వద్దు!

Tatkal Booking: ఈ 5 చిట్కాలు పాటిస్తే.. సెకన్లలో వ్యవధిలో తాత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!

Russia – Ukraine: డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డ రష్యా, ముక్కలు ముక్కలైన ఉక్రెయిన్ ప్యాసింజర్ రైలు!

Free Train Travel: ఇండియాలో స్పెషల్ రైలు, ఇందులో టికెట్ లేకుండా ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు!

Train Journey: 300 మైళ్ల ప్రయాణం.. రూ. 350కే టికెట్.. మయన్మార్ లో ట్రైన్ జర్నీ ఇలా ఉంటుందా?

Sensor Toilet: ఆ రైలులో ‘సెన్సార్’ టాయిలెట్.. మనోళ్లు ఉంచుతారో, ఊడపీకుతారో!

Pregnancy tourism: ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ఎప్పుడైనా విన్నారా! ఆ ప్రాంతం ఎక్కడ ఉందంటే?

IndiGo flights: ఐదేళ్ల తర్వాత చైనాకు ఇండిగో సర్వీసు.. కోల్‌కతా నుంచి మొదలు, టికెట్ల బుకింగ్ ప్రారంభం

Big Stories

×