Iftikhar Ahmed On IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అలాగే ప్రస్తుతం ఆడే ఆటగాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కంటే ఐపీఎల్ చిన్నది అనే అర్థం వచ్చేలా నిత్యం విషం కక్కుతూనే ఉన్నారు. పొద్దున లేస్తే చాలు ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ ( Iftikhar Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో ఏ ఒక్క ఫ్రాంచైజీ తనకు 50 కోట్లు ఆఫర్ చేసినా, నేను వెంటనే రిజెక్ట్ చేస్తానని బాంబు పేల్చారు. ఐపీఎల్ ఓనర్లు కాళ్లు మొక్కిన కూడా ఐపీఎల్ లోకి వెళ్ళబోనని తెలిపారు. పాకిస్తాన్ ( Pakistan) దేశానికి మాత్రమే ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇఫ్తికార్ అహ్మద్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు ఎగబడుతుంటే.. పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ పరువు తీసేలా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. 20 కోట్లు ఇచ్చిన ఐపిఎల్ ఆడబోనని ఇటీవల షాహీన్ ఆఫ్రిది వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా మరో పాకిస్తాన్ ఆటగాడు ఇఫ్తికార్ అహ్మద్ ( Iftikhar Ahmed) కూడా ఇదే తరహాలో స్పందించారు.
తనకు 20 కాదు 50 కోట్లు ఇచ్చి కాళ్ళు మొక్కిన ఐపీఎల్ లో అడుగు పెట్టబోనని వెల్లడించారు. పాకిస్తాన్ దేశానికి ఆడడమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. దీంతో ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. మీరు వచ్చినా కూడా తీసుకోవడానికి ఎవడు సిద్ధంగా లేడని.. నీ ముఖానికి 50 కోట్లు పెట్టే అవసరం ఎవరికి లేదని కౌంటర్లు పేల్చుతున్నారు.
2008 కంటే ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో పాకిస్తాన్ ప్లేయర్లకు చాన్స్ ఉంది. కానీ 2008 డిసెంబర్ నెలలో ముంబైలో దాడులు జరిగాయి. ఈ దాడులు చేసింది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ. ఈ తరుణంలోనే పాకిస్తాన్ ప్లేయర్లు ఐపిఎల్ ఆడకుండా బ్యాన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అప్పటినుంచి ఐపీఎల్ టోర్నమెంట్ కు దూరమయ్యారు ఈ పాకిస్తాన్ క్రికెటర్లు. అటు ఇండియా, పాక్ మధ్య ధ్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దు అయ్యాయి.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==