BigTV English

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి
Iga Swiatek vs. Jessica Pegula Extended Highlights: యూఎస్ ఓపెన్ 2024 లో ఒక షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, 2022 యూఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్  అయిన ఇగా స్వైటెక్ క్వార్టర్ ఫైనల్ లో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆరో ర్యాంకర్‌ జెస్సికా పెగులా (అమెరికా) చేతిలో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఎందుకో ఆట మొదలైనప్పటి నుంచి స్వైటెక్ ముందడుగు వేయలేకపోయింది. అసలు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. మ్యాచ్ అంతా ఏకపక్షంగా సాగిపోవడంతో ఇగా స్వైటెక్ ఏమైనా టెన్షను పడుతోందా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే తను 6-2, 6-4 వరుస సెట్లలో పరాజయం పాలైంది.


ఇక పెగులా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి సెమీస్‌కు దూసుకెళ్లింది. అక్కడ కరోలినా ముచోవాతో (చెక్‌ రిపబ్లిక్‌) తలపడనుంది.

మరో సెమీఫైనల్ లో రెండో సీడ్ అరియానా సబలంక (బెలారస్) వర్సెస్ ఎమ్మా నవారో (అమెరికా) మధ్య జరగనుంది. రెండు చోట్లా సెమీస్ లో అమెరికన్లు పోటీలో ఉన్నారు. వీరేగానీ గెలిస్తే ఇద్దరు అమెరికన్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇదెంతో ఆసక్తికరంగా మారుతుందని అంటున్నారు.


ఇక పురుషుల సింగిల్స్ లో ఇటలీకి చెందిన టాప్ ర్యాంకర్ సినర్ సెమీఫైనల్ కి చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్ లో రష్యాకి చెందిన మెద్వెదెవ్ పై 6-2, 1-6, 6-1, 6-4తో విజయం సాధించాడు. తను సెమీస్ లో బ్రిటన్ కు చెందిన జాక్ డ్రేపర్ తో తలపడనున్నాడు.

Also Read: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

ప్రస్తుతం సినర్ పైనే అంచనాలున్నాయి. ఎందుకంటే తనిప్పటికే ప్రపంచ అగ్రశ్రేని ఆటగాళ్లయిన జకోవిచ్, అల్కరాస్ లాంటి ఆటగాళ్లను ఓడించి ఇంత దూరం వచ్చాడు. దీంతో టైటిల్ ఫేవరెట్ గా ఉన్నాడు.

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంటులో స్టార్ ప్లేయర్లు, డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్‌, అయిదో సీడ్ జాస్మిన్ పౌలీని ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ఈ పోటీల్లో హీరోలు జీరోలు కావడం, మళ్లీ ఏడాదికి జీరోలు హీరోలు కావడం జరుగుతుంటుంది.

అయితే ఒకప్పుడు స్టార్ ప్లేయర్లు చాలా కాలం తమ నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకునేవారు. అందుకెంతో కష్టపడేవారు. కానీ ఇప్పుడు రెండు మూడేళ్లకు మంచి ఎవరి వద్దా నెంబర్ వన్ ర్యాంకు ఉండటం లేదు. ఇదే ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చగా మారింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×