EPAPER

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

“Pressure will always be there” Rishabh Pant ahead of Bangladesh Tests: ఒక్క క్రికెట్ అనే కాదు.. ఏ ఆటలోనైనా గెలుపు, ఓటములు ఉంటాయి. ఎవరైనా గెలవడం కోసమే ఆడుతుంటారని, ఆ క్రమంలో ఒత్తిడి తప్పకుండా ఉంటుందని యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ అన్నాడు. దులీప్ ట్రోఫీకి ముందు జియో టీవీతో మాట్లాడుతూ పంత్ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు.


భారతదేశంలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ ఏ ఆటకు లేదని అన్నాడు. 140 కోట్ల మంది ప్రజలు క్రికెట్ ని ఆసక్తిగానే చూస్తారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడేటప్పుడు భారత ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుందని అన్నాడు. భారతదేశం తరఫున ఆడుతున్నాం, ఇన్ని కోట్ల మంది చూస్తున్నారని.. భావన వచ్చినప్పుడు.. ఆ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుందని తెలిపాడు.

ఆ సమయంలో ఆ ఒత్తిడిని అధిగమించి ఆడగలిగినప్పుడే ఆటగాడిగా రాణిస్తామని తెలిపాడు. శిక్షణలో ఇది కూడా ఒక భాగమని తెలిపాడు. బాగా టెన్షన్ పడితే బౌలర్  బౌలింగు చేయలేడు, బ్యాటర్ బ్యాటింగ్ చేయలేడు, కీపర్ క్యాచ్ పట్టలేడని అన్నాడు. అది ప్రత్యర్థులకు వరంగా మారి, విజయం ఏకపక్షంగా మారిపోతుందని అన్నాడు.


ఈరోజుల్లో గెలుపోటముల మధ్య అంతరం చాలా తగ్గిపోయిందని అన్నాడు. నిజానికి టీ 20 ప్రపంచకప్ 2024 లో ఆఖరి ఓవర్ లో టీమ్ ఇండియా గెలిచిందని, అంతవరకు రెండు జట్ల మధ్య విజయం దోబుచులాడిందనే సంగతి మరువకూడదని అన్నాడు. ఇకపోతే ఆసియా దేశాల మధ్య పోటీలు జరగాలని, అన్ని జట్లు రాణించడం శుభపరిణామం అని తెలిపాడు. త్వరలో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ ను తక్కువ అంచనా వేయడానికి లేదని అన్నాడు.

Also Read: రాజస్థాన్ నుంచి మెంటార్ గా.. కోల్ కతాకి!

ఇక్కడ నుంచి టీమ్ ఇండియా వరుస సిరీస్ లతో బిజీగా గడపనుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అన్ని దేశాలతో 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సిరీస్ కి జట్టుని ఎంపిక చేసే క్రమంలో  బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది. దులీప్ ట్రోఫీలో ఎవరెలా ఆడుతున్నారో పరిశీలించనుంది. ఈ  క్రమంలో దులీప్ ట్రోఫీలో ఇండియా బీ తరఫున ఆడిన పంత్ 7 పరుగులే చేసి అవుటై నిరాశ పరిచాడు.

అయితే పంత్ చివరికేమన్నాడంటే.. నిజానికి రెండేళ్ల క్రితం ఏక్సిడెంట్ అయినప్పుడు మళ్లీ జాతీయ జట్టులో ఆడతానని అనుకోలేదని తెలిపాడు. కానీ అవకాశం వచ్చింది. ఐపీఎల్ ఆడాను, టీ 20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ లో ఉన్నాను. ఇదంతా కలగా ఉందని తెలిపాడు.

Related News

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Cristiano Ronaldo: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు

Big Stories

×