E-Paper
Advertisement

Suryakumar Yadav: ఆ టైమ్ లో.. బబుల్ గమ్ గట్టిగా నమిలా: సూర్యకుమార్

Suryakumar Yadav: ఆ టైమ్ లో.. బబుల్ గమ్ గట్టిగా నమిలా: సూర్యకుమార్
Advertisement

IND vs AFG T20 WC 2024 Suryakumar Yadav Reaction Goes Viral after Virat Kohli Out : టీ 20 ప్రపంచకప్.. సూపర్ 8లో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ అద్భుతంగా ఆడి 53 పరుగులు చేశాడు. అవే జట్టు విజయంలో కీలకంగా మారాయి. అయితే మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ గా అవార్డు అందుకున్న సూర్యకుమార్ మాట్లాడుతూ.. ఆ క్షణంలో గ్రౌండులో జరిగిన సిట్యూషన్ వివరించాడు.

కీలకమైన సమయంలో విరాట్ కొహ్లీ (24) అవుట్ అయిపోయాడు. అప్పుడు నిజంగా చాలా బాధనిపించింది. టెన్షన్ నుంచి బయటపడేందుకు అప్పుడు నోట్లో ఉన్న బబుల్ గమ్ ను మరింత గట్టిగా నమిలాను. ఎందుకంటే ఆఫ్గనిస్తాన్ కి బ్రేక్ వచ్చే సమయం అది.  ఇక్కడ మరో వికెట్ పడితే, మ్యాచ్ ఆఫ్గాన్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. కెప్టెన్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో అవుట్ కాకూడదు, బౌలర్లపై పైచేయి సాధించాలి.. ఈ లక్ష్యంతో ఆడాను.

Advertisement

నాకు హార్దిక్ పాండ్యా నుంచి మంచి సహకారం అందింది. తను కూడా ఒక రేంజ్ లో విరుచుకు పడటంతో ఆఫ్గాన్ బౌలర్లు నెమ్మదించారు. దీంతో మ్యాచ్ ని మళ్లీ మన వైపు తిప్పుకోగలిగామని అన్నాడు. సముద్రంలో పడవ బలమైన గాలి వేగానికి ఒక వైపునకు వెళ్లిపోతుంటే, మళ్లీ బలవంతంగా దిశ మార్చడానికి పడే కష్టమే ఇక్కడ గ్రౌండులో కూడా ఉంటుందని అన్నాడు.

Also Read: ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా గెలుపు

Advertisement

మిడిల్ ఓవర్లలో ఆడేందుకు ఎక్కువ ఇష్టపడతానని అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తో కలిసి చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. నా ఆటతీరు తనకి తెలుసు. టీమ్ ఇండియా జట్టు కూర్పు, ఓపెనర్లుగా వారిద్దరూ వెళ్లడంతో నా బాధ్యతలు తెలుసు.

నాకు అవగాహన ఉందని అన్నాడు. ఈ వరల్డ్ కప్ లో తొలిసారి భారత బ్యాటర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిందని అన్నాడు. కాకపోతే ఈసారి కూడా బౌలర్లకే ఈ  అర్హత ఉందని అన్నాడు. మ్యాచ్ ని కాపాడటంలో వారిదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించాడు. బుమ్రా రెండో ఓవర్ నుంచే వికెట్లు తీసి ఆఫ్గాన్ ని ఒత్తిడిలోకి నెట్టాడని అన్నాడు. స్పిన్నర్లు తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని తెలిపాడు. అర్షదీప్ మ్యాచ్ ని ముగించాడని కితాబిచ్చాడు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×