Ind vs Aus 3rd Test Day 4: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బెన్ లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగవ రోజు {Ind vs Aus 3rd Test Day 4} ఆటలో మొత్తానికి భారత జట్టు ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. 51/4 తో మంగళవారం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఈరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. టేలెండర్లు ఆకాష్ దీప్ (27*), జస్ప్రీత్ బూమ్రా (10*) పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి భారత్ ని ఆదుకున్నారు. దీంతో ఇండియా {Ind vs Aus 3rd Test Day 4} ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది.
Also Read: Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్.. ఇది ఫ్రూఫ్?
ఈరోజు {Ind vs Aus 3rd Test Day 4} కూడా వరుణుడు మ్యాచ్ కి అంతరాయం కలిగించినప్పటికీ.. చివరకు వెలుతురు లేని కారణంగా అంపైర్లు మ్యాచ్ ని త్వరగానే ముగించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఇంకో 193 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77 పరుగులతో రాణించడంతో టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. ఇక ఐదవరోజు ఆటని డ్రా చేసుకునే అవకాశం భారత జట్టు ముందుంది. మెయిన్ బ్యాటర్స్ అంతా అవుట్ కావడంతో ఇక ఫాలో ఆన్ తప్పదని అందరూ భావించారు.
కానీ ఆకాష్ దీప్, బూమ్రా అద్భుతంగా ఆడుతూ {Ind vs Aus 3rd Test Day 4} ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమీన్స్ 4 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3, జోష్ హెజిల్ ఉడ్, నాథన్ లయన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఎంసీసీ రూల్ ప్రకారం ఫాలో ఆన్ రూల్ గురించి స్పష్టత ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు మాత్రమే ఫాలో ఆన్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. అయితే భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేయకపోతే ఫాలో ఆన్ లో పడుతుంది.
Also Read: ICC WTC 2025 final: మూడో టెస్ట్ డ్రా అయితే.. WTC నుంచి టీమిండియా తప్పుకోవడమేనా ?
ఒకవేళ ఈ 246 పరుగులు చేయలేకపోతే భారత్ ని తన రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్ కి ఆహ్వానించాలా..? వద్దా..? అనేది ఆస్ట్రేలియాపై ఆధారపడి ఉంటుంది. అలా కాదని రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఆసీస్ కి లేదు. మొత్తానికి {Ind vs Aus 3rd Test Day 4} భారత్ ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. ఇక భారత బ్యాటర్ లలో కేఎల్ రాహుల్ 84, యశస్వి జైస్వాల్ 4, గిల్ 1, విరాట్ కోహ్లీ 3, పంత్ 9, రోహిత్ శర్మ 10, రవీంద్ర జడేజా 77, మహమ్మద్ సిరాజ్ 1, నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులు చేశారు. ఇక ఆకాష్ దీప్ (27*), బూమ్రా (10*) పరుగులతో నాట్ అవుట్ గా క్రీజ్ లో ఉన్నారు.